Anand Deverakonda : డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టిన దేవరకొండ బ్రదర్.. వీడియో వైరల్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆనంద్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Anand Deverakonda : డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టిన దేవరకొండ బ్రదర్.. వీడియో వైరల్
Anandh

Updated on: Mar 21, 2021 | 3:30 PM

Anand Deverakonda : క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆనంద్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఓటీటీ వేదికగా విదులైనప్పటికీ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు పుష్పక విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రానికి డెబ్యూ దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గీత్ సైని – సాన్వే మేఘన నాయికలు. దేవరకొండ బ్రదర్స్ తండ్రి గోవర్ధన రావు దేవేరకొండ- విజయ్ మట్టపల్లి- ప్రదీప్ ఎర్రబెల్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆనంద్ తన డ్యాన్స్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు చేసినిమా రెండు సినిమాల్లో ఆనంద్ డ్యాన్స్ లు చేసే స్కోప్ రాలేదు. కానీ ఇప్పుడు పుష్పక విమానం కోసం ఆనంద్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఆనంద్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక ఈ సినిమా నుండి సిలకా పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయగా అది వైరల్ గా మారింది. రామ్ మిరియాలా ఈ పాటను రచించి ఆలపించారు. ఇప్పుడు ఇదే పాటకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఆనంద్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

పెళ్లయ్యాక బ‌ట్ట‌లుతికి, అంట్లుతోమి బ‌క్క‌గా అయిపోయానన్న యంగ్ హీరో నితిన్..

బాహుబలిని రికార్డ్స్ ను క్రాస్ చేసిన జాతిరత్నాలు..: Jathi Ratnalu movie beats Baahubali records video