AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత ఫ్యాన్స్‌ను ఫుల్ హ్యాపీ చేసే అప్‌డేట్.. ఆమె ఫోకస్ పెట్టబోయే నెక్ట్స్ మూవీ ఏదంటే..?

Samantha Next Movie: లేటెస్ట్‌గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఘన విజయం సాధించారు. అయితే ఈ సినిమా హిట్‌ అయినా... అభిమానులు మాత్రం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

Samantha: సమంత ఫ్యాన్స్‌ను ఫుల్ హ్యాపీ చేసే అప్‌డేట్.. ఆమె ఫోకస్ పెట్టబోయే నెక్ట్స్ మూవీ ఏదంటే..?
Samantha
Janardhan Veluru
|

Updated on: Nov 29, 2022 | 5:01 PM

Share

Samantha: రీసెంట్‌గా తన హెల్త్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన సమంత అభిమానులను డైలమాలో పడేశారు. సమంత కండిషన్ గురించి విన్న తరువాత, అసలు సమంత సినిమాలు కంటిన్యూ చేస్తారా..? ప్రజెంట్ సెట్స్ మీదున్న సినిమాల పరిస్థితేంటి? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ డౌట్స్‌కు త్వరలోనే ఫుల్ స్టాప్‌ పెట్టబోతున్నారు సామ్‌. లేటెస్ట్‌గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఘన విజయం సాధించారు. అయితే ఈ సినిమా హిట్‌ అయినా… అభిమానులు మాత్రం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అందుకు కారణం సమంత హెల్త్ కండిషనే. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టుగా ఎనౌన్స్ చేసిన సమంత… అభిమానులకే కాదు.. ఇండస్ట్రీ జనాలకు కూడా చాలా డౌట్స్ క్రియేట్ చేశారు.

యశోద డబ్బింగ్‌ సమయంలోనే సెలెన్ బాటిల్‌తో కనిపించటంతో అసలు ఫ్యూచర్‌లో సమంత సినిమాలు కంటిన్యూ చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందంటే… సెట్స్ మీద ఉన్న సినిమాలను కంప్లీట్ చేసేందుకైన సమంత డేట్స్ ఇస్తారా అన్న డౌట్స్ కూడా రెయిజ్ అయ్యాయి. కానీ ఆ డౌట్స్‌కు చెక్‌ పెడుతూ మరోసారి తాను ఫైటర్ అని ప్రూవ్ చేసుకున్నారు సామ్‌.

చాలా రోజులుగా ట్రీట్మెంట్‌లో ఉన్న సమంత అనారోగ్యాన్ని జయించారు. ఇప్పటికే కోలుకున్న ఈ బ్యూటీ… త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే కొత్త షూటింగ్ పూర్తి చేసుకున్న ఖుషీ సినిమాను ముందుగా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌ 10 లేదా 15 నుంచి ఖుషీ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. సమంత హెల్త్ కండిషన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేసింది యూనిట్‌. ఈ ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్ తరువాత సమంత అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. ఇన్నాళ్లు సమంత అసలు సినిమాలు కంటిన్యూ చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా సామ్‌ రీ ఎంట్రీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.

మరిన్ని సినిమా వార్తలు చదవండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత