Hema Malini: వినేష్‌ ఫోగట్‌ అనర్హత వేటుపై హేమమాలిని షాకింగ్ కామెంట్స్.. అలా అనేసిందేంటీ..!!

వినేష్‌ ఫోగట్‌ కు దైర్యం చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు సెలబ్రిటీలు మహేష్ బాబు , సమంత లాంటి వారు కూడా వినేష్‌ ఫోగట్‌ దైర్యం చెప్తూ పోస్ట్ లు షేర్ చేశారు. అలాగే భారతీయులంతా ఆమెను అభినందిస్తున్నారు. నువ్వు ఎప్పటికీ ఛాంపియన్‌వే, దేశానికి నువ్వు గర్వకారణం అని కామెంట్స్ చేస్తున్నారు.

Hema Malini: వినేష్‌ ఫోగట్‌ అనర్హత వేటుపై హేమమాలిని షాకింగ్ కామెంట్స్.. అలా అనేసిందేంటీ..!!
Hema Malini

Updated on: Aug 09, 2024 | 1:52 PM

పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచే అవకాశాన్ని భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కోల్పోయింది. కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువ ఉండడంతో ఫైనల్‌లో పోటీ చేసే అవకాశం రాలేదు. దీనిపై పలువురు స్పందిస్తున్నారు. వినేష్‌ ఫోగట్‌ కు దైర్యం చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు సెలబ్రిటీలు మహేష్ బాబు , సమంత లాంటి వారు కూడా వినేష్‌ ఫోగట్‌ దైర్యం చెప్తూ పోస్ట్ లు షేర్ చేశారు. అలాగే భారతీయులంతా ఆమెను అభినందిస్తున్నారు. నువ్వు ఎప్పటికీ ఛాంపియన్‌వే, దేశానికి నువ్వు గర్వకారణం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వినేష్‌ ఫోగట్‌ స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోవడం పై అలనాటి నటి, ఎంపీ హేమమాలిని కూడా మాట్లాడారు. అయితే హేమ మాలిని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆమె చేసిన కామెంట్స్ కారణంగా ఆమెను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఏమన్నదంటే..

పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వినేష్‌ ఫోగట్‌ అనర్హత వేటుపై హేమమాలిని ఓ మీడియాతో మాట్లాడారు. ‘ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అలాగే, వింత. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. సరైన శరీర బరువును నిర్వహించడం ముఖ్యం. ఇది కళాకారులకు, క్రీడాకారులకు, మహిళలకు గుణపాఠం. వినేష్ వీలైనంత త్వరగా 100 గ్రాములు తగ్గనివ్వండి. కానీ ఆమెకి మరో అవకాశం రాదు’ అని హేమ మాలిని అన్నారు.

ఇలాంటి ప్రకటనలు చేసే హేమమాలిని ఎంపీగా ఉండేందుకు అనర్హుడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి వారికి ఓటేస్తారో అర్థం కావడం లేదు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. తన శరీర బరువును పట్టించుకోకుండా వినేష్ ఫోగట్ ఇలా మారలేదు. సమోసాలు, ఐస్‌క్రీమ్‌లు తిని బరువు పెరగలేదు. ఆమె పాటించే స్ట్రిక్ట్ డైట్, ట్రైనింగ్ గురించి తెలియకుండా ఇలాంటి ప్రకటనలు చేయకండి’ అంటూ హేమ మాలికి క్లాస్ తీసుకున్నాడు మరొకరు.

వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌లో భారత్‌కు బంగారు పతకం తెస్తాడని అందరూ ఆశించారు. కానీ శరీర బరువు కారణంగా ఆ కల చెదిరిపోయింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు వినేష్ ఫోగట్‌ను ప్రోత్సహించారు. అలియా భట్, ఫర్హాన్ అక్తర్, కరీనా కపూర్, తాప్సీ పన్ను, రణవీర్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ‘వినీష్ మా ఛాంపియన్’ అని అన్నారు. ఇందులో హేమ మాలిని ప్రకటన ట్రోల్స్‌కు కారణమైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..