Actress Urvashi: తస్సాదియ్యా.. ఈ నటి కూతురు నెట్టింట గ్లామర్ బాంబ్.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

|

Dec 11, 2024 | 10:59 AM

దక్షిణాది ప్రేక్షకులకు నటి ఊర్వశి సుపరిచితమే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ తొలినాళ్లలో కథానాయికగా మెరిసిన ఊర్వశి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. తాజాగా ఆమె కూతురి ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Actress Urvashi: తస్సాదియ్యా.. ఈ నటి కూతురు నెట్టింట గ్లామర్ బాంబ్.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
Urvashi
Follow us on

సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నటి ఊర్వశి. మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో కనిపించింది. తెలుగులో అంతిమ తీర్పు, చెట్టుకింద ప్లీడర్, పాడుతా తీయగా, విజయ రామరాజు, సందడే సందడి, అల్లరి రాముడు వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో మొత్తం కలిపి 700 లకు పైగా సినిమాల్లో నటించింది. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తుంది. తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది. తనదైన కామెడీ టైమింగ్ తో వెండితెరపై నవ్వులు పూయిస్తుంది ఊర్వశి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె కూతురు ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా.. అచ్చం హీరోయిన్ లా ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

2000లో ఊర్వశి మలయాళ నటుడు మనోజ్ జైన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి జన్మించింది. ఆ తర్వాత కొన్నాళ్లకే వీరిద్దరు మనస్పర్థలతో విడిపోయారు. ఇక ఊర్వశి కూతురు తేజ లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. కుంజత పేరుతో నెట్టింట తెగ హడావిడి చేస్తుంటుంది. అటు ట్రెడిషనల్ బ్యూటీగా.. ఇటు మోడ్రన్ అమ్మాయిగా నెట్టింట క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది తేజ లక్ష్మీ. తాజాగా ఈ అమ్మాయి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఊర్వశి కూతురు తేజ లక్ష్మి అందంలో తల్లిని మించిపోయిందని.. ఇప్పుడున్న హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తేజ లక్ష్మి కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.