Udaya Bhanu: మళ్లీ బిజీ అవుతోన్న ఉదయ భాను.. ఈ యాంకరమ్మ కవల పిల్లలను చూశారా? లేటేస్ట్ ఫొటోస్ వైరల్

యాంకర్, నటి ఉదయ భాను ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మళ్లీ బిజీ అవుతోంది. సినిమాలు చేయడంతో పలు టీవీ షోస్, మూవీ ఈవెంట్లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తోందీ అందాల తార. ఉదయ భాను నటించిన బార్బరిక్ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది.

Udaya Bhanu: మళ్లీ బిజీ అవుతోన్న ఉదయ భాను.. ఈ యాంకరమ్మ కవల పిల్లలను చూశారా? లేటేస్ట్ ఫొటోస్ వైరల్
Udaya Bhanu

Updated on: Aug 09, 2025 | 6:55 AM

ఒకప్పుడు స్టార్ యాంకర్ గా బుల్లితెరను ఏలింది ఉదయ భాను. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా , డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు.. ఇలా ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా చేసింది ఉదయ భాను. తన అందం, అభినయంతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయింది. కేవలం టీవీ షోలే కాదు లీడర్, జులాయి వంటి కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేసిందీ అందాల తార. సుమారు 10-15 ఏళ్ల పాటు బుల్లితెరను శాసించిన ఉదయ భాను సడెన్ గా కనుమరుగైపోయింది. ఏ టీవీ షోలనూ కనిపించలేదు. ఏ సినిమాలోనూ నటించలేదు. అందుకు ఆమె వ్యక్తిగత కారణాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్‌ కారణంగా ఉదయ భాను టీవీ షోలకు దూరమైందని అంటుంటారు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ బుల్లితెరపై మెరుస్తోంది ఉదయభాను. టీవీ షోస్ తో పాటు పలు మూవీ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తోందీ అందాల తార. ప్రస్తుతం బొమ్మ బొరుసు, నీతోనే డాన్స్, గ్యాంగ్‌ లీడర్‌ తదితర టీవీ షోల్లో మెరుస్తోంది యాంకర్ ఉదయ భాను

 

ఇవి కూడా చదవండి

టీవీ షోస్ తో పాటు కొన్ని సినిమాల్లోనూ ఉదయ భాను నటిస్తోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా బార్బరిక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 22న ఇది విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఉదయ భాను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అదే సమయంలో తన కూతుళ్ల గురించి కూడా మాట్లాడింది.
తన కూతుళ్ల కోసం ఓ పాట రాసినట్టు, త్వరలో దాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. `నా ట్విన్ బేబీస్‌పైన ఓ పాట రాశాను. త్వరలో దాన్ని రిలీజ్‌ చేస్తాను. నా పిల్లలంటే నాకు ప్రాణం’ అని ఉదయ భాను చెప్పింది.

ఇద్దరు కూతుళ్లతో యాంకర్ ఉదయ భాను..

ఉదయభాను 2004లో విజయ్‌ కుమార్‌ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కవల కూతుళ్లు జన్మించారు. వారి పేరు భూమి నక్షత్ర, యూవి ఆరాధ్య. ప్రస్తుతం వీరికి 9ఏళ్లు. ఇప్పుడు ఈ ట్విన్ బేబీస్ ఫోర్త్ క్లాస్‌ చదువుతున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉదయ భాను రెగ్యులర్ గా తన పిల్లల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది.

సీఎం చంద్రబాబు నాయుడితో ఉదయ భాను ఫ్యామిలీ..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.