Samantha Ruth Prabhu: సమంతకు వచ్చిన మయోసైటిస్ డిసీస్‌ తగ్గినట్టేనా?

|

Jun 04, 2023 | 11:13 AM

సామ్‌ కొచ్చిన మయోసైటిస్ డిసీస్‌ తగ్గినట్టేనా? లేక ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే ఈ మాత్రం సినిమాలు చేయగులుగుతున్నారా? అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్ల మధ్య నడుస్తున్న డిబెట్.  

Samantha Ruth Prabhu: సమంతకు వచ్చిన మయోసైటిస్ డిసీస్‌ తగ్గినట్టేనా?
Samantha
Follow us on

ఎట్ ప్రజెంట్ సామ్ వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. తీరిక లేకుండా షూటింగ్స్‌తో గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిపోయారు. అంటే సామ్‌ కొచ్చిన మయోసైటిస్ డిసీస్‌ తగ్గినట్టేనా? లేక ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే ఈ మాత్రం సినిమాలు చేయగులుగుతున్నారా.? అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్ల మధ్య నడుస్తున్న డిబెట్. చైతో బ్రేకప్ తరువాత నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఈ బ్యూటీ.. తనకు మయోసైటిస్ వ్యాధి ఉన్నట్టు చెప్పి అందర్నీ షాకయ్యేలా చేశారు. తన శరీరాన్ని ఆవరిస్తున్న నిస్సత్తువ గురించి చెప్పారు. పది మందిలో ఓ ఆరుగురికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధని.. దీనికి ట్రీట్మెంటే లేదని.. ఎమోషనల్ అయ్యారు. కానీ మీ ప్రేమ ఉంటే చాలు.. తాను త్వరగా కోలుకుంటూ అంటూ.. మళ్లీ మునుపటి సమంతలా మీముందుకు వస్తా అంటూ.. గట్టిగా చెప్పారు.

మరి అప్పుడలా చెప్పిన సమంత.. ఇప్పుడు కోలుకున్నట్టేనా? పూర్తి ఆరోగ్యంగా మారినట్టేనా అంటే..? కాదనే చెప్పాలి. మందులు వాడినంత వరకు IVIG – ఇంట్రావీనస్‌ ఇమ్యూనోగ్లోబలిన్‌ థెరపీ సెషన్‌కు అటెండ్ అవుతున్న వరకు సమంత ఆరోగ్యానికి ఏం డోకా లేదనే చెప్పాలి. మయోసైటిస్ ఏం చేయలేదనే నమ్మాలి.

అందుకే సామ్ కూడా.. కాస్త తన లైఫ్ స్టైల్‌ను మార్చుకున్నారు. సరైన టైంలో IVIG మెడిసిన్‌ తీసుకుంటూ.. యోగా.. మెడిటేషన్ .. లాంటి చేస్తూ.. మధ్యలో ఫిట్‌ నెస్ కోసం వర్కవుట్లు కూడా చేస్తూ.. తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. తను కమిట్ అయిన సినిమాలను ఫినిష్‌ చేస్తున్నారు.