Priyanka Mohan: ప్రియాంక టాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి గ్యాప్ అందుకే తీసుకుందా..?

|

Apr 23, 2023 | 5:20 PM

తమిళ్ లో సూర్య, శివ కార్తికేయన్ లతో సినిమాలు చేసింది. ఈ సినిమాలు తెలుగు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా శివ కార్తికేయన్ తో కలిసి చేసిన వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలు మంచి హిట్స్ పైగా  నిలిచాయి. అయితే ఈ అమ్మడు తెలుగులో సినిమాలు చేయడానికి చిన్న గ్యాప్ ఇచ్చింది.

Priyanka Mohan: ప్రియాంక టాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి గ్యాప్ అందుకే తీసుకుందా..?
Priyanka Arul Mohan
Follow us on

ప్రియాంకా అరుల్ మోహన్.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు తన నటనతో అందంతో ఆకట్టుకుంది. నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ప్రియాంక. ఆ తర్వాత యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి సినిమా చేసింది. తమిళ్ లో సూర్య, శివ కార్తికేయన్ లతో సినిమాలు చేసింది. ఈ సినిమాలు తెలుగు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా శివ కార్తికేయన్ తో కలిసి చేసిన వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలు మంచి హిట్స్ పైగా  నిలిచాయి. అయితే ఈ అమ్మడు తెలుగులో సినిమాలు చేయడానికి చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యణ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది ఈ చిన్నది.

చూడచక్కని రూపం.. ఆకట్టుకునే నటన ఉన్న ఈ అమ్మడికి తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. దాంతో తమిళ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు పవన్ సినిమాతో తిరిగి తెలుగులో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు ఇన్ని రోజులు తెలుగులో సినిమాలు చేయకపోవడానికి ఓ కారణం ఉందట. తెలుగులో చేస్తే స్టార్ హీరోల సినిమాల్లోనే చేయాలనీ ఫిక్స్ అయ్యిందట.

తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా మహేష్, పవన్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తే చేద్దామని ఎదురుచూసిందట.. అందుకే చిన్న గ్యాప్ వచ్చిందట. ఇప్పుడు ఇదే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం పవర్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఓజి సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయ్యారు పవన్.