కొందరు డైరెక్టర్ల లాగే రూటు మార్చేందుకు రెడీ అయిపోతున్నారు హారీష్ శంకర్. డైరెక్షన్ చేసి చేసి బోరుకొడుతుందో.. లేక తనలోని డైరెక్టర్ ను రైటర్ డామినేట్ చేస్తున్నాడో తెలియదు కాని.. ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు జెట్ స్పీడ్‌గా ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసేందుకు సిద్దమైపోయారు. ఇంతకీ ఏంటా నిర్ణయం? మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..! ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా లైన్లో పెట్టిన హరీష్ శంకర్. దానితో పాటే ఓ వెబ్ సిరీస్ ను రూపొందించే పనిలో పడ్డారు. అయితే డైరెక్టర్‌గా కాదు వన్ ఆఫ్‌ది ప్రొడ్యూసర్ గా..!గీతా ఆర్ట్స్‌తో కలిసి ఆహా ఓటీటీ కోసం ఓ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నారు హరీష్. ఈ సిరీస్ ను సంతోషం ఫేమ్ దశరథ్ డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఫైనలైజ్ అయిన ఈ ప్రాజెక్ట్ తొందర్లో షూట్ కంప్లీట్ చేసుకుని మన ముందుకు రానుంది.
ఇక ఇప్పటికే పూరీ, సుకుమార్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, క్రిష్.. ఓ వైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరో వైపు నిర్మిస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌తో వీరందరి సరసన చేరిపోయారు హరీష్ శంకర్. అయితే మెగా హీరోలతో సినిమాలు చేసినప్పటికీ.. దర్శకుడిగా గీతా ఆర్ట్స్ లో ఒక్క సినిమా కూడ చేయలేదు ఈ యంగ్ డైరెక్టర్ . ఇక ఇప్పుడు డైరెక్టర్ గా కాకుండా ఏకంగా నిర్మాణ భాగస్వామిగా ఆ క్యాంప్ లోకి అడుగుపెడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :