#HappyBirthdayPawanKalyan: పవన్ స్థాయి ఇది..ట్విట్టర్‌లో ఇండియా నెంబర్ 1 ట్రెండింగ్

పవర్ స్టార్..ఇప్పుడు జనసేనానిగా రూపాంతరం చెందారు. సినిమాలను కంప్లీట్‌గా పక్కనపెట్టి పూర్తిగా రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సినీనటుడిగా ఉన్నా, పొలిటీషన్‌గా మారిన ఆయన ఇమేజ్ చెక్కుచెదరనిది. ఆయనకు అభిమానులు కంటే భక్తులు ఉంటారనడంతో ఆశ్చర్యం లేదు. ఇక రేపు(సెప్టెంబర్ 2) పవన్  కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో కళ్యాణ్ బాబు ఫీవర్‌తో ఊగిపోతుంది. ఇంకొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ 48వ ఏట అడుగుపెట్టబోతున్నారు. వాస్తవానికి 15 రోజల ముందునుంచే పవన్ భక్తులు ట్రెండ్‌ని మొదలుపెట్టారు.  బాబాయ్ […]

#HappyBirthdayPawanKalyan: పవన్ స్థాయి ఇది..ట్విట్టర్‌లో ఇండియా నెంబర్ 1 ట్రెండింగ్
#HappyBirthdayPawanKalyan

Updated on: Sep 01, 2019 | 7:51 PM

పవర్ స్టార్..ఇప్పుడు జనసేనానిగా రూపాంతరం చెందారు. సినిమాలను కంప్లీట్‌గా పక్కనపెట్టి పూర్తిగా రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సినీనటుడిగా ఉన్నా, పొలిటీషన్‌గా మారిన ఆయన ఇమేజ్ చెక్కుచెదరనిది. ఆయనకు అభిమానులు కంటే భక్తులు ఉంటారనడంతో ఆశ్చర్యం లేదు. ఇక రేపు(సెప్టెంబర్ 2) పవన్  కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో కళ్యాణ్ బాబు ఫీవర్‌తో ఊగిపోతుంది. ఇంకొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ 48వ ఏట అడుగుపెట్టబోతున్నారు. వాస్తవానికి 15 రోజల ముందునుంచే పవన్ భక్తులు ట్రెండ్‌ని మొదలుపెట్టారు.  బాబాయ్ బర్త్ డేను పురష్కరించుకుని మూడు రోజుల క్రితం రామ్ చరణ్ కామన్ డీపీని కూడా షేర్ చేశారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో ఆయన ఫోటోనే దర్శనమిస్తుంది.

ప్రస్తుతం #HappyBirthdayPawanKalyan హ్యాష్ ట్యాగ్ ఇండియాలోనే టాప్-1 ట్రెండింగ్‌లో ఉంది. అదే విధంగా పవర్ స్టార్ టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఇవే ట్రెండ్స్ రేపంతా కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే పవన్ స్టార్ స్థాయి వేరు, ఆయన స్థానం వేరు అనేది. అడ్వాన్స్ హ్యపీ బర్త్ డే పవన్ స్టార్.