Happy Birthday Sukumar: టాలీవుడ్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ..

|

Jan 11, 2021 | 10:53 AM

టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ పుట్టిన ఈరోజు నేడు. ఆయన ఈరోజు 51వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా సుకుమార్ కు పలువురు సెలబ్రెటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

Happy Birthday Sukumar: టాలీవుడ్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ..
Follow us on

Happy Birthday Sukumar:టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ పుట్టిన ఈరోజు నేడు. ఆయన ఈరోజు 51వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా సుకుమార్ కు పలువురు సెలబ్రెటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2004 లో బన్నీ హీరోగా ఆర్య సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్‌గా అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే అటు ఇండస్ట్రీని ఇటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడీ లెక్కల మాస్టర్. సుకుమార్ కు బన్నీ బర్త్ డే విషెష్ ను సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. నా స్నేహితుడు, దర్శకుడు సుకుమార్ కు పుట్టిన శుభాకాంక్షలు. మేమిద్దరం కలిసి ప్రయాణం ప్రారంభించాము. అయితే అతని సినీ జర్నీ వెరీ స్పెషల్, అతని కెరీర్ లో ఎన్నో మైళ్ళు అందుకోవాలని కోరుకుంటున్న… హ్యాపీ బర్త్ డే డార్లింగ్ సుక్కు అంటూ ట్వీట్ చేశాడు. సిని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ హరీష్ శంకర్, రత్నవేలు అనేక మంది తమ సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

సుకుమార్ తన 16 ఏళ్ల సినీ కెరీర్ లో దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 మూవీలతో పాటు ఒక షార్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించగా.. మహేష్ బాబుతో నెంబర్ 1 నేనుఒక్కడినే అనిపించాడు. ఇక ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో.. రామ్ చరణ్ తో రంగస్థలం, నాగ చైతన్య తో 100 % వంటి సూపర్ హిట్స్ సినిమాలను అందించాడు.

తాజగా మరోసారి బన్నీ తో పుష్ప అంటూ హ్యాట్రిక్ హిట్ కు రెడీ అవుతున్నాడు సుక్కు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర తాజాగా తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Also Read: బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి ? అసలు కారణం ఇదే..