Hansika Motwani: అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ హన్సిక. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఈ వయ్యారి భామ. ఇక ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రుధ్రాన్ష్ సెల్ లాయిడ్ పతాకం ఫై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న” 105 మినిట్స్”. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ చిత్రం లో కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపించబోయే గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయని,చిత్ర యూనిట్ తెలిపింది.ఇండియన్ సినిమా స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషం గా ఉంది.. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించేందుకు ఛాలెంజ్ గా ఉందని ఈ చిత్ర సంగీత దర్శకులు సామ్ సి.యస్ అభిప్రాయపడ్డారు. హన్సిక నటన అద్భుతంగా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ మరోసారి కొనియాడారు. ఇక ఈ సినిమాలో హన్సిక నటన మెప్పిస్తుందని అంటున్నారు చిత్రయూనిట్..
మరిన్ని ఇక్కడ చదవండి :