Guppedantha Manasu: గుప్పెడంత మనసు జగతి ‘నో మోర్ సీక్రెట్స్’.. ఫస్ట్‌లుక్ పోస్టర్‍తోనే జ్యోతిరాయ్ రచ్చ..
కన్నడ, మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రెటీస్.. సీరియల్స్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవుతారు. అందులో జ్యోతిరాయ్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ గుప్పెడంత మనసు జగతి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పాత్రకు తెలుగు అడియన్స్ మనసులలో ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ చీరకట్టులో .. ఎంతో హుందాగా.. అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకుంది. ఇందులో జగతి కట్టు బొట్టుకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.

తెలుగు ఫ్యామిలీ అడియన్స్ ఎక్కువగా అభిమానించేది బుల్లితెర నటీనటులనే. ప్రస్తుతం కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. సీరియల్ స్టార్ట్ అయ్యి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గదు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ అన్నింటినీలోనూ పరభాష నటీనటులే కనిపిస్తున్నారు. కన్నడ, మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రెటీస్.. సీరియల్స్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవుతారు. అందులో జ్యోతిరాయ్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ గుప్పెడంత మనసు జగతి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పాత్రకు తెలుగు అడియన్స్ మనసులలో ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ చీరకట్టులో .. ఎంతో హుందాగా.. అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకుంది. ఇందులో జగతి కట్టు బొట్టుకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఇక అంతకు మించి కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే తల్లిగా జగతి నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. గుప్పెడంత మనసు సీరియల్లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న నటీనటులలో జగతి మెయిన్. కొద్ది రోజుల క్రితమే సీరియల్లో జగతి రోల్ ముగిసింది.
సీరియల్లో కట్టుబొట్టుతో ఎంతో సంప్రదాయంగా.. హుందాతనంగా కనిపించిన జగతి అలియాస్ జ్యోతిరాయ్.. బయట మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మోడ్రన్ లుక్‌గా గ్లామర్ లుక్‌లో చిట్టిపొట్టి దుస్తులతో కనిపిస్తూ షాకిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. సీరియల్ నుంచి బయటకు వచ్చేసిన జగతి.. ఇప్పుడు ఓటీటీలో వరుస ఓటీటీలతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ చేసిన జగతి.. ఇప్పుడు మరో కొత్త సిరీస్ స్టార్ట్ చేసింది. ‘నో మోర్ సీక్రెట్స్’ అంటూ కొత్త వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అందులో బీచ్ ఒడ్డున చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని ఎవరికో లిప్ కిస్ ఇస్తుంది జ్యోతి. ఈ ఫోటోను తన ఇన్ స్టాలో రిలీజ్ చేస్తూ వెబ్ సిరీస్ వివరాలు రాసుకొచ్చింది.
View this post on Instagram
నో మోర్ సీక్రెట్స్ వెబ్ సిరీస్ నుంచి తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని.. తెలుగు, హిందీ భాషలలో ఈసిరీస్ స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఇందులో తనకు ఫీమేల్ లీడ్ రోల్ ఇచ్చినందుకు పార్థు సర్ కు ధన్యవాదాలు తెలిపింది. నో మోర్ సీక్రెట్స్ వెబ్ సిరీస్ పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. జగతి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. గతంలో ఏ మాస్టర్ పీస్ ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ తో సైతం షాకిచ్చింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె చేస్తున్న సిరీస్ పాత్రలకు.. గతంలో బుల్లితెరపై పోషించిన పాత్రకు అసలు పొంతన లేకపోవడం గమనార్హం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.