తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద పండుగ కావటంతో ఈ సీజన్‌లో సినిమాలు రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు కూడా పోటి పడుతుంటారు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ పోటి హాట్ టాపిక్ అవుతోంది. సంక్రాంతి మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు టాప్ స్టార్స్ బరిలో దిగుతుండటంతో వసూళ్లు నుంచి థియేటర్ల ఎలాట్మెంట్ వరకు చాలా ఇష్యూస్ తెర మీదకు వస్తున్నాయి. నెక్ట్స్ ఇయర్ ఈ పోటీ మరో లెవల్‌లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
2024 సంక్రాంతి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ ఎవ్వర్ క్లాష్‌ను ఫేస్ చేస్తోంది. సూపర్ స్టార్స్, సీనియర్ హీరోస్, యంగ్ హీరోస్ ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్‌ల నుంచి పోటికి రెడీ అవుతున్నారు హీరోలు. మాస్ కమర్షియల్ సినిమాల నుంచి యాక్షన్, సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్, సోషియా ఫాంటసీ ఇలా అన్ని జానర్ల సినిమాలు సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి.
ఈ లిస్ట్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి కావటంతో గుంటూరు కారం సంక్రాంతి బరిలో దిగటం కన్ఫార్మ్ అయిపోయింది. ఇదే విషయాన్ని మేకర్స్ కూడా గట్టిగా చెబుతున్నారు.
సీనియర్ స్టార్ వెంకీ కూడా సంక్రాంతి సీజన్ మీద సీరియస్‌గా ఫోకస్ చేశారు. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాను సంక్రాంతి సీజన్‌లోనే ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పట్టున్న వెంకీకి సంక్రాంతి సీజన్ పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్ సినిమాలు కూడా సంక్రాంతి సీజన్‌నే టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు ఇంకా షూటింగ్ స్టేజ్‌లోనే ఉండటంతో సంక్రాంతి బరిలో దిగటం పక్కా అన్న నమ్మకం అయితే లేదు. కానీ ఒకే వేల ఇన్ టైమ్‌లో అన్ని పనులు పూర్తయి సంక్రాంతి బరిలో దిగితే పోటి మరింత టఫ్‌గా మారుతుంది.
ఇలా స్టార్ హీరోలందరూ పోటిలో ఉన్న అదే సీజన్‌లో బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో తేజ సజ్జ. ఫాంటసీ డ్రామగా రూపొందుతున్న హనుమాన్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తే మార్కెట్ పరంగా హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ ఇంత పోటిలో హనుమాన్ బరిలో దిగటం అంత మంచి నిర్ణయం కాదంటున్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ లిస్ట్‌లో ఎన్ని సినిమాలు ఫైనల్‌గా సంక్రాంతి బరిలో దిగుతాయో చూడాలి.
మరిన్ని సినిమా వార్తలు చదవండి