Guntur Kaaram 4th Day Collections: ‘గుంటూరు కారం’ నాలుగు రోజుల కలెక్షన్స్.. ఆ మూవీ రికార్డ్ బ్రేక్ చేసేనా ?..

|

Jan 16, 2024 | 10:45 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అటు వసూళ్ల పరంగానూ దూసుకుపోతుంది. తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రోజుకు రోజుకీ ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. మొదటి రోజే రూ.92 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో రూ. 164 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక నిన్న సంక్రాంతి పండగ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగాయి. ఇప్పుడు నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లకు చేరువయ్యింది.

Guntur Kaaram 4th Day Collections: గుంటూరు కారం నాలుగు రోజుల కలెక్షన్స్.. ఆ మూవీ రికార్డ్ బ్రేక్ చేసేనా ?..
Guntur Karam
Follow us on

సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకున్న సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అటు వసూళ్ల పరంగానూ దూసుకుపోతుంది. తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రోజుకు రోజుకీ ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. మొదటి రోజే రూ.92 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో రూ. 164 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక నిన్న సంక్రాంతి పండగ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగాయి. ఇప్పుడు నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లకు చేరువయ్యింది. గతంలో త్రివిక్రమ్ రూపొందించిన అల వైకుంఠపురంలో సినిమా రికార్డ్ బ్రేక్ చేసేందుకు చేరువలో ఉంది. తొలివారం అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ప్రాంతీయ సినిమాగా నిలిచింది.

మొదటి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక నిన్న సంక్రాంతి సందర్బంగా.. కేవలం మన దేశంలోనే రూ.14.50 కోట్లు వసూలు చేసింది. అలాగే ఈ మూవీ కలెక్షన్స్ రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటివరకు తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షేర్ సాధించిన ప్రాంతీయ సినిమాాగా త్రివిక్రమ్ రూపొందించిన అల వైకుంఠపురంలో నిలిచింది. ఈ మూవీ ఫస్ట్ వీక్ లోనే రూ.107 కోట్లు వసూలు రాబట్టింది. ప్రస్తుతం గుంటూరు కారం షేర్ నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.87 కోట్లు వసూలు చేసింది. జనవరి 15న ఈ చిత్రం దేశంలో 46.07 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

అమ్మ సెంటిమెంట్ తోపాటు.. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేశ్, జయరాం, ఈశ్వరీ కీలకపాత్రలు పోషించారు. ఈచిత్రానికి తమన్ సంగీతం అందించారు. ‘గుంటూరు కారం’ జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.