Posani Krishna Murali: ఊహించని షాక్.. తిప్పితిప్పి మళ్లీ జైలుకే పోసాని కృష్ణ మురళి

చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల తో పాటు వారి కుటుంబ సభ్యులపై నటుడు పోసాని మురళీకృష్ణ అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో దూషించారని జనసేన కార్యకర్త ఆదోని త్రీ టౌన్ పిఎస్ లో గత నవంబర్లో ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా పోసానిపై కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితం అతనిని పిటి వారెంట్ పై ఫారెస్ట్ చేసి కర్నూలు తెచ్చారు.

Posani Krishna Murali: ఊహించని షాక్.. తిప్పితిప్పి మళ్లీ జైలుకే పోసాని కృష్ణ మురళి
Posani Krishna Murali

Edited By: Rajeev Rayala

Updated on: Mar 13, 2025 | 3:26 PM

పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదించారు. బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు పోసాని. తప్పు చేస్తే నరికేయండని.. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నారు. రెండు ఆపరేషన్లు, స్టంట్ లు వేశారని.. బెయిల్‌ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుటే లాయర్లతో వాపోయారు. వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారన్నారు. సెక్షన్‌ 111 వర్తించదని వాదించామన్నారు అడ్వొకేట్‌ పొన్నవోలు సుధాకర్. మా వాదనలతో కోర్టు ఏకీభవించిందన్నారు. ఇక అనేక కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతున్నారని అన్నారు పొన్నవోలు. పైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామన్నారు.

కాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల తో పాటు వారి కుటుంబ సభ్యులపై నటుడు పోసాని మురళీకృష్ణ అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో దూషించారని జనసేన కార్యకర్త ఆదోని త్రీ టౌన్ పిఎస్ లో గత నవంబర్లో ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా పోసానిపై కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితం అతనిని పిటి వారెంట్ పై ఫారెస్ట్ చేసి కర్నూలు తెచ్చారు. జడ్జ్ ముందు హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. ప్రస్తుతం పోసాని కర్నూలు జిల్లా జైలులో ఉంటున్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం పోసానికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీనికి ముందే మూడు రోజులపాటు కష్టానికి ఇవ్వాలని ఆదోని త్రీ టౌన్ పోలీసులు పిటిషన్ వేయగా కోర్టు తిరస్కరించింది. కస్టడీ పిటిషన్ తిరస్కరించడం, పోసానికి బెయిల్ మంజూరు చేసిందని పోసాని తరపు న్యాయవాదులు తెలిపారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా పోసానికి షాక్ తగిలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..