
స్టార్ హీరోలు, హీరోయిన్లు, పెద్ద డైరెక్టర్లు, యాక్షన్ సీక్వెన్సులు, స్పెషల్ సాంగ్స్ లు, వీఎఫ్ఎక్స్ హంగులు.. ప్రస్తుతం ఓ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వాలంటే పైన చెప్పినవన్నీ ఉండాల్సిందే. అయితే ఇవేవీ లేకున్నా కేవలం కంటెంట్ తోనే హిట్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. ఈ మధ్యన వచ్చిన కోర్ట్, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలు ఇందుకు మంచి ఉదాహరణలు. ఇప్పుడు ఒక గుజరాతీ సినిమా విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా పేరు ‘లాలో కృష్ణ సదా సహాయతే’. గుజరాతీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఈ చిన్న సినిమా ఇప్పుడు వివిధ భాషల్లోకి కూడా రిలీAdd Newజ్ అవుతోంది. ముందుగా హిందీలో ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. నవంబర్ 28న లాలో కృష్ణ సదా సహాయతే హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. ఆద్యంతం ఎమోషనల్ గా సాగే ఈ మైథాలజీ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.
ఈ సినిమా అక్టోబర్ 10, 2025న థియేటర్లలో గుజరాతీలో విడుదలైంది. మొదట పెద్దగా వసూళ్లు రాలేదు. కానీ మౌత్ టాక్ తో నెమ్మదిగా ఈ సినిమా కలెక్షన్లు పెరిగాయి. మూడవ వారం నుండి ఈ మూవీ కలెక్షన్లు హోరందకున్నాయి. చివరకు, నాల్గవ వారం నాటికి, ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులు థియేటర్లకు రావడం ప్రారంభించారు. ఒకే రోజులో రూ. 5 కోట్ల బిజినెస్ చేసిన మొదటి గుజరాతీ సినిమా ఇదే. ఇప్పటివరకు ఈ సినిమా రూ.71 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే దీని వసూళ్లు రూ.100 కోట్ల మార్కును చేరుకుంటాయి. ఏ గుజరాతీ సినిమాకైనా ఇది అద్భుతమైన విజయం. ఈ మూవీ ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.50 లక్షలు. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి అంకిత్ సాకియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయంలో నటీనటుల సహకారం కూడా గొప్పది. ఇందులో రీవా రాచ్, శ్రుహాద్ గోస్వామి, కరణ్ జోషి, అన్షు జోషి, కిన్నల్ నాయక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతలు డబ్బింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత, ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొంది, థియేటర్లలో విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.