
కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, ముంబై, పూణే, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా సంతోషంగా గడిపారు. ఈ సంవత్సరం గణేష్ ఊరేగింపులో సినిమా సెలబ్రేటిలతోపాటు టెలివిజన్ నటీనటులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే పూణే గణేశ్ నిమజ్జన వేడుకలలో ఓ హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పాన్ ఇండియా సినీప్రియులకు ఆమె సుపరిచితమే. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. గణేష్ శోభయాత్రలో ఫేమస్ కలవంత్ ధోల్ తాషా పాఠక్ బృందంలో కనిపించింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
ఇటీవల పూణేలోని మార్కెట్ యార్డ్ గణేష్ మండల్ వినాయక నిమజ్జన ఊరేగింపులో కలవంత్ ధోల్-తాషా పాఠక్ అనే బ్యాండ్ బృందం పాల్గొంది. ఈ టీంలో హీరోయిన్ శ్రుతి మరాఠే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె టాప్ హీరోయిన్. హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన దేవర చిత్రంలో తారక్ భార్య పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. శ్రుతి విషయానికి వస్తే.. హిందీలో అనేక సీరియల్స్, సినిమాల్లో నటించింది 2016లో ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్ ఘటనేకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగులో కేవలం దేవర సినిమాలోనే కనిపించారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..