
స్టార్ హీరోయిన్ గా కాకపోయినా అవకాశాలు అంటుకుంటూ కంటిన్యూ అవుతున్న భామలు చాలా మందే ఉన్నారు టాలీవుడ్ లో.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధంలేకుండా హీరోలు సినిమాలు చెయ్యొచ్చు కానీ హీరోయిన్స్ విషయంలో అలా కాదు.. ఫ్లాప్‌లు పలకరించాయంటే దాదాపు పక్కన పెట్టేస్తారు. కానీ పైన కనిపిస్తోన్న ముద్దుగుమ్మ మాత్రం ఫ్లాప్ లొచ్చినా.. వరుస ఆఫర్లు అందుకుంటూ సినిమాలు చేస్తోంది. కేవలం గ్లామర్ తోనే కాదు నటనతో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది ఈ చిన్నది. ఇంతకు ఎవరో గుర్తుపట్టారా.. ఎవరో కనిపెట్టడం అంత కష్టమేమి కాదు కానీ ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన భామనే.. ఇంతకు పై ఫొటోలో వయ్యారాలు ఒలకబోస్తోన్న చిన్నది ఎవరో కాదు.
అందం , అభినయం కలబోసిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ చిన్నది ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అంతకు ముందు ఈ బ్యూటీ మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఊహలు గుసగుసలాడే మూవీ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. అయితే ఈ అమ్మడికి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. ఒకవేళ హిట్ వచ్చిన అది హీరోల ఖాతాలోకి వెళ్ళిపోతుంది.
Raashi Khannaరీసెంట్ గా పక్కా కమర్షియల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. గోపీచంద్ హీరోగా మంచి ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రాశి ఖన్నా తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు కార్తి హీరోగా నటించిన సర్ధార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..