
ప్రస్తుతం తెలుగు తెరపై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. కన్నడ, మలయాళం, తమిళం ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మలు అందం, అభినయంతో తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కేరళ కుట్టీస్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి స్టార్ హీరోయిన్లుగా రాణిస్తుండగా.. మరో చిన్నది అప్పుడే రచ్చ స్టార్ట్ చేసింది. ఇంకా తెలుగు తెరకు పరిచయం కాకముందే అందరి దృష్టి ఆకర్షించింది. పైన ఫోటోను చూశారు కదా.. మాస్క్ మాటున దాగిన అందం.. నయనాలలోనే భావాలెన్నో.. ఈ కేరళ కుట్టి ఎవరో గుర్తుపట్టండి. మీకోసం చిన్న క్లూ. ఈ అమ్మడు నటించిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఎవరో గుర్తుపట్టిండి.
ఆ అందం ఎవరంటే.. మలయాళ హీరోయిన్ గౌరీ కిషన్. ఇప్పటివరకు ఈ అమ్మడు తెలుగులో ఏ సినిమా చేయలేదు. తొలిసారిగా యంగ్ హీరోతో వెండితెరపై సందడి చేయబోతుంది. జాను సినిమాలో మెరిసిన ఈ చిన్నది.. ఇప్పుడు శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. ఇందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది గౌరీ కిషన్. ఈ చిత్రానికి చిరంజీవి పెద్ద కూతురు.. అల్లుడు ఏర్పాటు చేసిన కొత్త బ్యానర్ నిర్మిస్తుంది. ప్రశాంత్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీదేవి – శోభన్ బాబు విలేజ్ నేపథ్యంలో నడిచే కథ. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఈనెల 18న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ సుందరి ఎన్ని మార్కులను సంపాదించుకుంటుందనేది చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.