Tollywood: ఈ క్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆడియన్స్ హృదయాలు దోచేసిన బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ? ..

|

May 20, 2023 | 7:14 PM

ఫోటోలో కనిపిస్తున్న ఆ క్యూటీ.. పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతోపాటు.. హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా తన అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్ హృదయాలను దొచుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో నటించింది. ఎవరో గుర్తుపట్టగలరా..

Tollywood: ఈ క్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆడియన్స్ హృదయాలు దోచేసిన బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ? ..
Actress
Follow us on

సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ తెగ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ టూ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, షారుఖ్ హీరోల పిక్స్ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ త్రోబ్యాక్ ట్రెండ్ లో భాగంగా ఓ స్టార్ హీరోయిన్ బాల్యం తాలూకు పిక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ క్యూటీ.. పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతోపాటు.. హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా తన అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్ హృదయాలను దొచుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో నటించింది. ఎవరో గుర్తుపట్టగలరా.. తనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

కెరటం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, నాన్నకు ప్రేమతో, జయ జానకీ నాయకా చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన రకుల్.. యారియాన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

అయితే అక్కడ కూడా ఈ బ్యూటీకి సరైన హిట్టు పడలేదు. చాలా రోజులుగా రకుల్ కు అనుకున్నంతగా ఆవకాశాలు రావడం లేదు. దీంతో తెలుగులో ఆమె సినిమా చేసి చాలా కాలం అవుతుంది. ఇదిలా ఉంటే.. రకుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.