పైన ఫోటోలో ఉన్న ఓ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన అమ్మాయి. బుల్లితెరపై ఆమె తెగ ఫేమస్. ప్రతి ఛానల్లోనూ తన షో తప్పకుండా ఉండాల్సిందే. చిన్న సినిమా నుంచి భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు ప్రతి చిన్న కార్యక్రమానికీ తనే వ్యాఖ్యత. ఎవరో గుర్తుపట్టండి. ఆమె మరెవరో కాదండి.. యాంకర్ సుమ. తెలుగు రాష్ట్రాలోని ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం పేరు. చలాకీతనం.. వాక్చాతుర్యంతో తెలుగునాట టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. తాను హోస్ట్‌గా చేస్తోన్న షోలలో తనదైన పంచులతో కామెడీని పండిస్తూ అందర్నీ అలరిస్తుంది. ఈరోజు (మార్చి 22) సుమ కనకాల పుట్టినరోజు.
1974 మార్చి 22న కేరళలో జన్మించింది సుమ. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్లో సుమ నటించింది. ఈ సమయంలోనే దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 1999 ఫిబ్రవరి 10న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి బాబు, పాప ఉన్నారు.
ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్లలో సుమ కనకాల నెంబర్ వన్. కేరళ అమ్మాయి అయినా… తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లికి ముందు పలు చిత్రాల్లో నటించిన సుమ… వివాహం తర్వాత పూర్తిగా బుల్లితెరకు అంకితమైంది. ఆమె యాంకరింగ్ ఎన్ని గంటలకైనా ప్రేక్షకులకు బోర్ కొట్టదు. అందుకే సామాన్య ప్రజలే కాదు.. సినీ ప్రముఖులకు కూడా సుమ అంటే చాలా ఇష్టం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.