Tollywood: ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? ఆర్జే టు టాలీవుడ్ స్టార్ హీరో.. వరుసగా నాలుగు 100 కోట్ల సినిమాలు

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోల్లో ఇతను కూడా ఒకడు. ఇటీవల ఇతను చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. ఈజీగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తున్నాయి. అన్నట్లు ఈ స్టార్ హీరో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కూడా ..

Tollywood: ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? ఆర్జే టు టాలీవుడ్ స్టార్ హీరో.. వరుసగా నాలుగు 100 కోట్ల సినిమాలు
Tollywood Actor

Updated on: Oct 30, 2025 | 7:05 PM

పై ఫొటోను గమనించారా? అందులో ఉన్నది అక్కాతమ్ముళ్లు. అక్క గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ తమ్ముడు మాత్రం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో. బాక్సాఫీస్ కలెక్షన్ కింగ్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు. ముఖ్యంగా నీళ్లు తాగినంత ఈజీగా వంద కోట్ల సినిమాలు చేస్తున్నాడు. అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఎదిగిన హీరోల్లో ఇతను కూడా ఒకడు. కెరీర్ ప్రారంభంలో పలువురు స్టార్ డైరెక్టర్ల దగ్గర క్లాప్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ గా పని చేశాడు. సినిమా ఇండస్ట్రీలోని మెలకువలు నేర్చుకున్నాడు. అదే సమయంలో ఒక రేడియో స్టేషన్ లో ఆర్జేగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలతో తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. వరుసగా విజయాలు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మినిమిం గ్యారెంటీ హీరో అంటే ఇతని పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అన్నట్లు ఇతను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కూడా. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో చాలా ముందుంటాడు. ఆ మధ్యన ఒక చిన్న సినిమాతోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. ఇక స్టార్ హీరోగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతోన్న ఈ హీరో మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని.

పై ఫొటో విషయానికి వస్తే.. ఇందులో నాని పక్కన ఉన్నది అతని అక్క దీప్తి. గతంలో మీట్ క్యూట్ అనే ఓ సినిమాకు ఆమె దర్శకత్వం వహించింది. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నాని ప్రొడక్షన్ హౌస్ లోనూ కీలక బాధ్యతలు నెరవేరుస్తోంది దీప్తి. భవిష్యత్ లో దర్శకురాలిగా మరిన్ని సినిమాలు చేస్తానంటోంది.

ఇవి కూడా చదవండి

ఓజీ డైరెక్టర్ సుజిత్ తో కలిసి కొత్త సినిమా ఓపెనింగ్ లో..

ఇక హీరో నాని విషయానికి వస్తే.. ప్రస్తుతం దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఓజీ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ది ప్యారడైజ్ సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.