
పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ లో బాగా ఫేమస్. అలాగనీ ఈ అమ్మాయి హీరోయిన్ కూడా కాదు. కనీసం ఒక్క సినిమాలోనూ కూడా నటించలేదు. అయితేనేం ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన గ్లామరస్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలతో నెట్టింట ఈ అమ్మడు చేసే అరాచకం మాములుగా ఉండదు. ముఖ్యంగా తన తల్లితో కలిసి ఈ క్యూటీ చేసే డ్యాన్స్ వీడియోలు, పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అప్పుడప్పుడు నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ‘ఐ డోన్డ్ కేర్’ అంటూ తనకు నచ్చింది చేసుకుంటూ ముందుకెళ్లిపోతోన్నారీ తల్లీ కూతుళ్లు. అన్నట్లు ఈ స్టార్ కిడ్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తన తల్లి అడుగు జాడల్లోనే నడుస్తూ హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు సీనియర్ నటీమని సురేఖా వాణి కూతురు సుప్రిత.
ఇప్పటికే సెలబ్రిటీ డాటర్ గా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుప్రిత ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తోంది. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోంది సుప్రిత.
Falling for this man over and over ❤️💙🥺🧿@imVkohli @RCBTweets #CSKvRCB pic.twitter.com/cwLtRVLwfD
— Bandaru Sheshayani Supritha (@_supritha_9) March 29, 2025
కాగా ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సురేఖా వాణి, సుప్రితల పేర్లు కూడా వినిపించాయి. గతంలో వీరు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ఈ తల్లీ కూతుళ్లు కూడా అంగీకరించారు. అయితే ప్రస్తుతం అలాంటి పనులేమీ చేయడం లేదంటూ ఆ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశారు.
Happy Holi 🙏🏻❤️
Don’t encourage betting apps 🫵🏻 pic.twitter.com/Kf7HnSELky— Bandaru Sheshayani Supritha (@_supritha_9) March 14, 2025
Kissik ❤️🔥#Kissik #Pushpa2 pic.twitter.com/MVqo8Kk3hk
— Bandaru Sheshayani Supritha (@_supritha_9) November 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..