AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. మెగాస్టార్, ఎన్టీఆర్‌లతో సూపర్ హిట్స్

చిన్నప్పుడు బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి.. పెద్దయ్యాక.. సన్నజాజిలా చాలా నాజుగ్గా మారిపోయింది. తన అందం, అభినయంతో ఫేమస్ హీరోయిన్ గా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ లతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. మెగాస్టార్, ఎన్టీఆర్‌లతో సూపర్ హిట్స్
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 19, 2026 | 11:16 AM

Share

ఈ ఫొటోలోని అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ఆమె ఫేమస్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తమిళంలో అయితే అజిత్, విశాల్, సూర్య, ఆర్య, మాధవన్ లతో కలిసి నటించింది. ఇక బాలీవుడ్ లో అయితే ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, సన్నీ డియోల్ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే చాలా మంది లాగే ఇప్పుడీ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. పిల్లల పెంపకంతోనే బిజీ బిజీగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఫిట్ నెస్, ఓవర్ వెయిట్, పోస్ట్ ప్రెగ్నెన్సీ సమస్యలు, బాడీ టోన్ తదితర అంశాలకు సంబంధించి మహిళలకు కీలకమైన సూచనలు, సలహాలు అందిస్తోంది.

మరి ఇంతకీ ఆ అమ్మాయెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే ఆన్సర్ మేమే చెప్పేస్తాం లేండి. ఆమె మరెవరో కాదు సమీరా రెడ్డి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ యాక్ట్ చేసింది. మెగాస్టార్ జై చిరంజీవ, ఎన్టీఆర్ అశోక్, నరసింహుడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అలాగే కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో రానా దగ్గుబాటి, వెంకటేష్ లతో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. 2013 వరకు సినిమాలు చేసిన సమీరా 2014లో అక్షయ్‌ వర్దే అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇవి కూడా చదవండి

అత్తతో సమీరా రెడ్డి..

కాగా చాలా మంది లాగే సమీరా రెడ్డి సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. 2024లో నామ్ అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఆఖరి సవాల్ అనే ఓ హిందీ మూవీలోనూ సందడి చేసింది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు సమీరా చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

సమీరా రెడ్డి లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us