
పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది. చాలా ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయింది. అయితే పిల్లలు కాస్త పెద్దదైన తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చింది. సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్, మోహన్ లాల్.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అత్తమ్మగా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ నటికి ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అలా తాజాగా తన త్రో బ్యాక్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిందీ అందాల తార. ఇప్పుడది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ నటి ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే సమాధానం కూడా మేమే చెబుతాం లెండి. ఆ నటి మరెవరో కాదు అత్తారింటికి దారేది ఫేమ్ నదియా.
కాగా నదియా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించారు. రజనీకాంత్, మోహన్‌లాల్, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, సురేష్ వంటి టాప్ హీరోలతో కలిసి నటించింది.
అయితే సినిమాల్లో ఉండగానే 1988లో అమెరికన్ బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్‌ను వివాహం చేసుకుంది నదియా. ఆతర్వాత ఫ్యామిలిలీతో కలిసి యూఎస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కాగా ఈ దంపతులకు 1996లో సనమ్ అనే కుమార్తె పుట్టింది. ఆతర్వాత ఐదేళ్లకు అంటే 2001లో రెండో అమ్మాయి జానా వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. 2008లో తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది నదియా. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.