AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న ముద్దుగుమ్మ.. డైరెక్టర్ పూరి పరిచయం చేసిన అందాల రాశి.. ఎవరో తెలుసా?

పై ఫొటోలో బూరె బుగ్గలతో తెగ ముద్దొచ్చేస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో నటించిందీ అందాల తార. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే మొదటి సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు గ్లామరస్ గా మారిపోయింది.

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న ముద్దుగుమ్మ.. డైరెక్టర్ పూరి పరిచయం చేసిన అందాల రాశి.. ఎవరో తెలుసా?
Tollywood Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Aug 16, 2024 | 11:37 AM

Share

పై ఫొటోలో బూరె బుగ్గలతో తెగ ముద్దొచ్చేస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో నటించిందీ అందాల తార. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే మొదటి సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు గ్లామరస్ గా మారిపోయింది. తన లేటెస్ట్ సినిమాలో మోడ్రన్ డ్రెస్‌ లతో రచ్చ రచ్చ చేసింది. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడికి భారీగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ మరెవరో కాదు డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ కావ్యా థాపర్. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆమె చిన్న నాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా అందులోదే. కాగా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా గురువారం (ఆగస్టు 15)న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. రామ్ తో పాటు కావ్యా థాపర్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు చిన్న సినిమాల్లోనే నటించిన ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడినట్లు అయ్యింది.

ముంబయికి చెందిన కావ్య థాపర్ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పతాంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి బ్రాండ్లకు మోడల్ గా వర్క్ చేసింది. 2013లో తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఆ తర్వాత 2018 ఈ మాయ పేరేమిటో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో మార్కెట్ రాజా ఎంబీబీఎస్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. 2021లో సంతోష్ శోభన్ తో కలిసి ఆమె నటించిన ఏక్ మినీ కథ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమానే కావ్యను తెలుగు ఆడియెన్స్ కు దగ్గర చేసింది. ఆ తర్వాత విజయ్ ఆంటోని బిచ్చగాడు 2, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన, రవితేజ ఈగల్ తదితర సినిమాల్లో నటించింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి

డబుల్ ఇస్మార్ట్ సెట్ లో కావ్యా థాపర్.. వీడియో

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Sakina (@sakbagasramua) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Puri Connects (@puriconnects) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us