పై ఫొటోలోని డాక్టరమ్మను గుర్తు పట్టారా? ఎంబీబీఎస్ చదివిన ఆమె డెంటిస్ట్ గా స్థిరపడాలనుకుంది. కానీ అనుకోకుండా మోడలింగ్ రంగంలో అవకాశం వచ్చింది. అంతే.. తన అందంతో ఫెమీనా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరిటాలు సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అంతే కాలం గిర్రున తిరిగింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏడాదికి అరడజనకు పైగా సినిమాలు చేసే స్థాయికి ఈ ముద్దుగుమ్మ ఎదిగిపోయింది. సక్సెస్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ అందాల తార ఎవరో ఈ పాటికే చాలామందికి అర్ధమై ఉంటుంది. యస్. తన మరెవరో కాదు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి. హర్యానాలోని పంచ్ కులా ప్రాంతంలో జన్మించిన మీనాక్షి పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటర్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. అదే సమయంలో మోడలింగ్ లో అవకాశం వచ్చింది. 2018లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలో పాల్గొని మొదటి రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అలాగే 2018లో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ అందుకుందీ అందాల తార.
అన్నట్లు మీనాక్షి చౌదరి స్టేట్ లెవల్ స్విమ్మర్. అలాగే స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. మొత్తానికి మీనాక్షి మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ అన్నమాట. కాగా లక్కీ భాస్కర్ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ అందాల తార త్వరలోనే సంక్రాతికి వస్తున్నాం సినిమాతో మన ముందుకు రానుంది. విక్టరీ వెంకటేశ్ ఈ మూవీలో హీరోగా నటించాడు. ఐశ్వర్యా రాజేష్ మరో కథానాయికగా నటించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
3MILLION+ VIEWERS have updated their playlists with #SankranthikiVasthunam 3rd single🔥
Celebrate the new year eve with #BlockbusterPongal song 🕺❤️🔥
— https://t.co/AEl91F78TF #సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.
Victory @Venkymama… pic.twitter.com/SOo8IGG9q6
— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.