Tollywood: ఈ నాట్యమయూరిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఒకే ఒక్క సాంగ్‌తో సెన్సేషన్

ఈ హీరోయిన్ కు చిన్నప్పటి డ్యాన్స్ పై ఆసక్తి. అందుకే స్కూల్, కాలేజీ కాంపిటీషన్స్ లో పాల్గొని పలు బహుమతులు గెల్చుకుంది. ఇక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తెలుగులో 8 సినిమాల్లో నటించింది. కానీ ఒకే ఒక్క సాంగ్ తో కుర్రాళ్లకు ఫేవరెట్ గా మారిపోయింది.

Tollywood: ఈ నాట్యమయూరిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఒకే ఒక్క సాంగ్‌తో సెన్సేషన్
Tollywood Actress

Updated on: Aug 15, 2025 | 9:55 AM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అలాగనీ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పటివరకు అన్నీ కలిసి ఓ 8 వరకు సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ మరికొన్ని సినిమాల్లో సహాయక నటిగానూ అలరించింది. అయితే ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమానే ఓ సెన్సేషన్. అందులోనూ ఒకే ఒక సాంగ్ ఈ హీరోయిన్ కు కుర్రాళ్లకు ఫేవరెట్ గా మార్చేసింది. అప్పట్లో చాలా మంది తమ మొబైల్ రింగ్ టోన్ గా ఈ సాంగ్ నే పెట్టుకున్నారంటే ఆ పాటకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే సాంగ్ లో ముద్దు సన్నివేశాలకు ఏ మాత్రం వెనకాడకుండా బోల్డ్ గా నటిచిందీ ముద్దుగుమ్మ. దీంతో మొదటి సినిమాతోన ఈ సొగసరి పేరు మార్మోగిపోయింది. అయితే అదంతా ఒక్క సినిమాకే పరిమితమైపోయింది. దీని తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి పై ఫొటోలో ఉన్న ఆ నాట్యమయూరిని గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ‘ఉండిపోరాదే’ అంటూ కుర్రాళ్లకు వలపు బాణం విసిరిన ప్రియ వడ్లమాని.

 

ఇవి కూడా చదవండి

2018లో ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది ప్రియ వడ్లమాని. ఆ తర్వాత శుభలేఖలు అనే చిన్న సినిమాలో యాక్ట్ చేసింది. అయితే హుషారు సినిమాతో ఈ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో ‘ఉండిపోరాదే’ సాంగ్ లో రొమాంటిక్ గా నటించి కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. వీటి తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర, ఓమ్ భీమ్ బుష్, వీరాంజనేయులు విహార యాత్ర, విశ్వం, బ్రహ్మాఆనందం తదితర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. కానీ ఇవేవీ పెద్దగా ఆడలేదు.

పెళ్లి  వేడుకలో చీరకట్టులో ప్రియ వడ్లమాని..

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ప్రియ. తాజాగా చీరకట్టులో ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

రక్షా బంధన్ వేడుకల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.