Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్‌’లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?

|

Jan 14, 2025 | 2:22 PM

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

Daaku Maharaaj: బాలయ్య డాకు మహారాజ్‌లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ..  ఎవరో గుర్తు పట్టారా?
Daaku Maharaaj
Follow us on

నందమూరి నటసింహం బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటడు బాబీ డియోల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజే బాలయ్య సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. బాలయ్య నటన, ఫైట్స్, బాబీ డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజీఎమ్.. ఇలా డాకు మహారాజ్ సినిమా విజయానికి అన్నీ అంశాలు దోహదం చేశాయి. కాగా ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పలువురు తెలుగు, తెలుగు, మలయాళ నటులు కూడా నటించారు. కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్, సైతాన్ ఫేమ్ రిషి, దేవర ఫేమ్ షైన్ టామ్ చాకో, రేసు గుర్రం విలన్ రవికిషన్, ఆడుకలం నరేన్, వీటీవీ గణేష్, సచిన్ ఖేడ్కర్, మకరంద్ దేశ్ పాండే, హర్ష వర్ధన్, రవి కాలే తదితరులు ఈ సినిమాలో కనిపించారు. అలాగే బిగ్ బాస్ తెలుగు ఫేమ్ దివి కూడా ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. బాలకృష్ణకు సహాయపడే ఝాన్సీ అనే పాత్రలో ఆమె ఓ కీలక పాత్రలో మెరిసింది.

బాలయ్య డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోన్న నేపథ్యంలో దివి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఈ సినిమా నుంచి షూటింగ్ సమయంలో దిగిన తన పాత్ర ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బొమ్మ సూపర్ హిట్టు.. డాకు మహారాజ్ సక్సెస్ పై బిగ్ బాస్ దివి..

బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టి మంచి క్రేజ్ తెచ్చుకుంది దివి. ఆ తర్వాత పలు టీవీ షోలు, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేసింది. ఈ మధ్యన సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంది. చిరంజీవి గాడ్ ఫాదర్ తో పాటు ఇటీవలే విడుదలైన లంబసింగి, హరికథ వంటి సినిమాల్లో దివి మెరిసింది.

డాకు మహారాజ్ సినిమాలో దివి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి