Tollywood: సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోగా.. ఎవరో గుర్తు పట్టారా?

డాక్టర్లు, ఇంజనీర్స్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్స్ అయ్యాం.. సినిమా హీరోలు, హీరయిన్ల నుంచి తరచూ వచ్చే మాట ఇది. అయితే ఈ టాలీవుడ్ హీరో మాత్రం క్రికెటర్ కావాలని కలలు కన్నాడట. స్కూల్ గేమ్స్ లోనూ సత్తా చాటాడట. కానీ అనుకోకుండా ఇప్పుడు..

Tollywood: సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోగా.. ఎవరో గుర్తు పట్టారా?
Sachin Tendulkar

Updated on: Dec 21, 2025 | 12:56 PM

పై ఫొటోలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. సచిన్ లాగే అతను కూడా క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్టుగానే 14 ఏళ్ల వరకు కూడా ఆ దిశగానే కెరీర్ ను ప్లాన్ చేసుకున్నాడు. స్కూల్ లెవల్ లో క్రికెట్ పోటీల్లోనూ సత్తా చాటాడు. అతని తండ్రి కూడా కుమారుడిని క్రికెటర్ గా చూడాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా క్రికెట్ వదిలేసి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. క్రమంగా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు టాలీవుడ్ గ్రీకు వీరుడిగా మన్ననలు అందుకుంటున్నాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యస్. పై ఫొటోలో సచిన్ తో ఉన్నది మరెవరో కాదు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక. ప్రస్తుతం అతను హీరోగా నటించిన ఛాంపియన్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో రోషన్ కు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా ఛాంపియన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా రోషన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నేను మొదట క్రికెటర్ అవ్వాలని అనుకున్నాను. 14 ఏళ్ల వరకు కూడా క్రికెటర్ అవుదామనే అనుకున్నాను. స్కూల్ లోనూ క్రికెట్ ఆడేవాడ్ని. అఖిల్, తమన్ అన్న టీమ్ లతో మ్యాచ్ లు ఆడాను. కానీ తర్వాత నటనపై ఇంట్రెస్ట్ వచ్చింది. మా నాన్నకు నన్ను క్రికెటర్ గా చూడాలని కోరిక. కానీ నేను క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి వచ్చాను. మా నాన్న కోరిక తీర్చలేకపోయాను. కానీ అప్పుడప్పుడు మ్యాచ్ లు ఆడుతుంటాను’ అని చెబుతున్నాడీ యంగ్ హీరో.

ఇవి కూడా చదవండి

ఛాంపియన్ సినిమా ప్రమోషన్లలో హీరో రోషన్ మేక..

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఛాంపియన్ మూవీ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.