
పై ఫొటోలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ గెటప్ లో ఉన్న నటుడిని గుర్తు పట్టారా? ఇతను ఒకప్పుడు టాలీవుడ్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో. అమ్మాయిల కలల రాకుమారుడు. తెలుగు, తమిళ్ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కేవలం హీరోగానే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా భయపెట్టాడు. ఈ విలక్షణ నటుడు ఇప్పుడు కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అయితే కమర్షియల్ వాసనలకు దూరంగా ఉండేలా వైవిధ్యమైన సినిమాలు మాత్రమే ఎంచుకుంటున్నాడు. ముఖ్యంగా ఎక్కువగా బయోపిక్స్ లో నటిస్తున్నాడు. పాత్రల్లో సహజంగా కనిపించడానికి ఎంతో కష్టపడుతున్నాడు. అలా ఇప్పుడు ఓ సినిమాలో NSA అజిత్ దోవల్ గెటప్ లో కనిపిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన ఈ హీరో ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అజిత్ దోవల్ గెటప్ లో సదరు హీరో ఒదిగిపోయాడంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ హీరో ఎవరో చాలా మంది గుర్తు పట్టేసి ఉంటారు. వయసు 50 దాటిపోయానా సరే కుర్ర హీరోలు సైతం అసూయ పడేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న ఈ హీరో మరెవరో కాదు దక్షిణాదిలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరైన మాధవన్.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా దురంధర్. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు చ్చింది. ఇందులో మాధవన్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో మాధవన్ లుక్ చేసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాధవన్ ఈ పాత్ర గురించి మాట్లాడారు. ‘నాకు గుర్తుంది, ఒక రోజు ఆదిత్య (డైరెక్టర్) నన్ను కలవడానికి వచ్చాడు. ఆ సమయంలో, నేను ఏదో షూటింగ్ లో ఉన్నాను. అతను ధురంధర్ కథను చెప్పాడు. కథ వింటున్నప్పుడు, అది నా మనసుక బాగా నచ్చేసింది. నాకు చాలా చారిత్రక చిత్రాలలో భాగమయ్యే అవకాశం వచ్చింది. కానీ ఈ చిత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను ధురంధర్ కోసం లుక్ టెస్ట్ ఇస్తున్నప్పుడు, నాలుగు గంటలు పట్టింది. ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లు నాకు అనిపించింది. ఆ సమయంలో, ఆదిత్య వచ్చి, ‘నీ పెదాలను సన్నగా చేసుకోవాలి. ఈ చిన్న మార్పు తర్వాత, మొత్తం లుక్ పర్ఫెక్ట్ గా అనిపించింది’ అని అన్నాడు’ అని మాధవన్ అన్నారు.
R Madhavan as Ajay Sanyal (Inspired from Ajit Doval)#Dhurandhar pic.twitter.com/AHjtxd5XBx
— DHURANDHAR🇮🇳 (@mysteriou_s1) November 18, 2025
ధురంధర్ సినిమాలో రణ్ వీర్ సింగ్, మాధవన్ తో పాటు అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ వంటి చాలా మంది పెద్ద నటులు భాగమయ్యారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి