Tollywood: ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. మార్షల్ ఆర్ట్స్‌లోనూ మేటి.. ఎవరో గుర్తు పట్టారా?

ఇంటర్నేషనల్ మదర్స్ డే (మాతృదినోత్సవం) సందర్భంగా ఇటీవల అందరూ తమ తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ మాతృమూర్తులకు వివిధ రకాల బహుమతులు ఇచ్చి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

Tollywood: ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. మార్షల్ ఆర్ట్స్‌లోనూ మేటి.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor

Updated on: May 14, 2025 | 1:27 PM

పై ఫొటోలో తల్లితో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టరా? వెంటనే గుర్తుపట్టడం కొంచెం కష్టమే. ఈ అబ్బాయి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు. ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరో కూడా. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న అతను సినిమాల్లో ఫైట్స్ ఇరగ దీస్తాడు. అలాగే మంచి ఈజ్ తో డ్యాన్స్ లు చేయగలడు. అయితే ఈ హీరో ఇప్పటివరకు ఓ డజను సినిమాలు తీశాడు కానీ ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ కూడా పడలేదు. ఆ మధ్యన బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఈ హీరో గురించి ఒక ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. బ్లాక్ బస్టర్ సినిమాలు లేకున్నా ఈ నటుడు పాన్ ఇండియా ఫేమస్. ఎలా అంటే ఈ హీరో సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా యూట్యూబ్ లో మాత్రం రికార్డులు దులిపేస్తుంటాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్లలో ఈ హీరో సినిమాలు యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. తెలుగులో చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు ఓ భారీ మల్టీస్టారర్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు. మంచు మనోజ్, నారా రోహిత్ లతో కలిసి అతను నటించిన ఒక సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అతనెవరో ఈ పాటికే అందరికీ అర్థమై ఉంటుంది. యస్. పై ఫొటోలో ఉన్న బుడ్డోడు మరెవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్. ఇది అతని చిన్ననాటి ఫొటో. మదర్స్ డే సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోను షేర్ చేశాడు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం మంచు మనోజ్, నారా రోహిత్ తో కలిసి భైరవం అనే మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడీ హీరో. విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు హైందవ అనే డివోషనల్ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో నటిస్తున్నాడు శ్రీనివాస్. అలాగే టైసన్ నాయుడు అనే మరో మూవీలోనూ హీరోగా నటిస్తున్నాడు. అలాగే రాక్షసుడు తర్వాత మరోసారి అనుపమా పరమేశ్వరన్ తో కలిసి కిష్కింధ పురి ఓ డిఫరెంట్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడీ హీరో.

ఇవి కూడా చదవండి

తల్లితో హీరో బెల్లం కొండ శ్రీనివాస్..

భైరవం సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .