
తాత ఒడిలో కూర్చొని పోజులలిస్తోన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా? ఇతను టాలీవుడ్ ఫేమస్ హీరో. లవ్ స్టోరీ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానూ మంచి విజయాలు అందుకున్నాడు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఈ హీరో ఓ మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈ మధ్యన కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తున్నాడు. ఆ దిశగా కొంతమేర సక్సెస్ అయ్యాడు కూడా. ఇటీవల ఈ హీరో నటించిన కొన్ని సినిమాలు మరీ సూపర్ హిట్ కాకపోయినా ఓ మేర ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్ ను బాగా మెప్పించాయి. అన్నట్లు ఈ హీరో భార్య కూడా ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది. అన్నట్లు ఈ భార్యభార్తలు గతంలో ఓ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ మొదలైంది. చాలా ఏళ్ల ప్రేమలో మునిగితేలిన తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. ఆ మధ్యన ఇద్దరూ కలిసి బిగ్ బాస్ షోలోనూ సందడి చేశారు. ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాలో హీరో, హీరోయిన్లుగా కలిసి నటిస్తున్నారు. సుమారు 11 ఏళ్ల తర్వాత వెండితెరపై జంటగా కనిపించనున్నారు.
ఇంతకీ పై ఫొటోలో ఉన్న కుర్రాడెవరనుకుంటున్నారా? అతను మరెవరో కాదు వరుణ్ సందేశ్. అందులో ఉన్నది వరుణ్ తాతయ్య జీడిగుంట రామచంద్ర మూర్తి . పుస్తకాలు, నవలలు చదివే వారికి జీడిగుంట రామచంద్ర మూర్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏకంగా 300 కథలు, 40 నాటికలు, 8 నవలలు రేడియో టెలివిజన్ సినిమా మాధ్యమాల్లో ఆయన రచనలు రాశారు. ఆలిండియా రేడియోలో 28 సంవత్సరాలు పనిచేసిన ఆయన ‘అమెరికా అబ్బాయి’ వంటి చిత్రాలకు కథ కూడా అందించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ సందేశ్- వితికా షేరు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై జంటగా కనిపించనున్నారు . సుమారు 11 ఏళ్ళ తర్వాత హీరో హీరోయిన్స్ గా కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. డియర్ ఆస్ట్రోనాట్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.