AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

'డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్స్ అయ్యాం' సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్ల నుంచి తరచూ వచ్చే మాట ఇది. అయితే ఈ టాలీవుడ్ హీరో మాత్రం కొంచెం డిఫరెంట్. టెన్నిస్ పై ఎంతో మక్కువ పెంచుకున్న అతను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు.

Tollywood: ఒకప్పుడు స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jan 22, 2025 | 8:57 AM

Share

పై ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయవాడలో పుట్టి పెరిగిన అతను సినిమాల్లో నటించాలనే లక్ష్యంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయాడు. కానీ సినిమాల్లో అంత ఈజీగా అవకాశం రాలేదు. చాలా ఏళ్లు కష్టపడితే కానీ నటుడిగా ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. మొదట కొన్ని చిన్న సినిమాల్లో నటించాడు. మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు. ఎక్కువగా లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ చేస్తూ తెలుగు ఆడియెన్స్ కు చేరువైపోయాడు. అన్నట్లు ఈ హీరోకు సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. తన తల్లిదండ్రులిద్దరినీ కూడా ఇందులో భాగం చేసుకున్నాడు. మరి ఈ తెలుగు హీరోను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. అతను మరెవరో కాదు నాగ శౌర్య. బుధవారం (జనవరి 22) ఈ హీరో పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హ్యాండ్సమ్ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో నాగ శౌర్యకు చెందిన చిన్న నాటి ఫొటోలు, వీడియోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సినిమాల్లోకి రాకముందు టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు నాగ శౌర్య. స్టేట్ లెవెల్ టోర్నమెంట్లలో కూడా ఆడాడట. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి టెన్నిస్ కి దూరమయ్యానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడీ హ్యాండ్సమ్ హీరో. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2023లో రంగభళి సినిమాలో చివరి సారిగా కనిపించాడు నాగ శౌర్య. ప్రస్తుతం పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటున్నాడు. అలాగే NS 24 (వర్కింగ్ టైటిల్ ) మూవీలోనూ యాక్ట్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

ఇవి కూడా చదవండి

నాగ శౌర్య లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటో..

View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

రంగభళి తర్వాత…

View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

నాగ శౌర్య 2022లో అనుషా శెట్టిని వివాహం చేసుకున్నాడు.  బెంగళూరులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనుషా శెట్టి ఇంటీరియర్ డిజైనర్.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన