Tollywood: సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ యాక్టర్ కమ్ డైరెక్టర్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టిపుల్ పర్సనాలిటీస్ లో ఈయన కూడా ఒకరు. సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ సినిమాలు తీశాడు. రచయితగా మన్ననలు అందుకున్నాడు. ఇప్పుడు నటుడిగా బిజీ బిజీగా ఉంటున్నాడు.

Tollywood: సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ యాక్టర్ కమ్ డైరెక్టర్..
Sr NTR, Devi Prasad,

Updated on: Jan 24, 2026 | 6:32 PM

పై ఫొటోలో సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు నటునిగా బిజీ బిజీగా ఉంటోన్న ఆయన గతంలో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మెగా ఫోన్ పట్టుకుని పలు కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలను తెరకెక్కించాడు. ఇలా తన బహుముఖ ప్రజ్ఞతో అందరి మన్ననలు అందుకున్న ఈ నటుడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తన సినిమా కెరీర్ లోని మధుర క్షణాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా ఆయన సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా అవార్డును తీసుకుంటోన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 1991లో వచ్చిన భారత్ బంద్ సినిమా 100 డేస్ ఫంక్షన్ లో భాగంగా ఈ ఫొటోను క్లిక్ మనిపించారు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ప్రారంభంలో ఈ నటుడు కూడా కోడి రామకృష్ణ దగ్గరే సహాయక దర్శకుడిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారీ సీనియర్ యాక్టర్. మరి ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా?అయితే సమాధానం మేమే చెబుతాం లెండి

ఈ ఫొటోలో సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్నది దేవీ ప్రసాద్. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ఆయన ఫొటోలు చూస్తే ఇట్టే గుర్తు పడతారు. దేవీ ప్రసాద్ గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో జన్మించాడు. బాపట్ల, మాచర్ల, సత్తెనపల్లి లలో విద్యాభ్యాసం చేసాడు. సినిమాలపై ఆసక్తితో డిగ్రీ మధ్యలో ఆపేసి, కోడి రామకృష్ణ వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. ఆతర్వాత 2002లో వచ్చిన ఆడుతూ పాడుతూ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. లీలా మహల్ సెంటర్, పాండు, బ్లేడ్ బాబ్జీ, మిస్టర్ పెళ్లి కొడుకు, కెవ్వుకేక వంటి సూపర్ హిట్ కామెడీ సినిమాలను తెరకెక్కించాడు.

దేవీ ప్రసాద్ ఫొటోస్..

ఇవి కూడా చదవండి

కేవలం డైరెక్టర్ గానే కాకుండా రచయితగా, నటునిగానూ సత్తా చాటారు దేవీ ప్రసాద్. అయోధ్య రామమయ్య, నీది నాది ఒకే కథ, ఎన్ టీఆర్, కథానాయకుడు, కల్కి, రాజ్ దూత్, తోలు బొమ్మలాట, ఇద్దరి లోకం ఒకటే, క్రాక్, నాంది, శ్రీకారం, అద్బుతం, విరాట పర్వం, జయమ్మ పంచాయతీ, ఆకాశ వీధుల్లో, కల్యాణం కమనీయం, వినరో భాగ్యము విష్ణుకథ, శివంభజే, మానాన్న సూపర్ హీరో, మనమే, లేటెస్ట్ గా దండోరా సినిమాల్లో సహాయక నటునిగా మెప్పించారు దేవీ ప్రసాద్.

దివంగత దర్శకుడు కోడి రామకృష్ణతో దేవీ ప్రసాద్