Tollywood: సచిన్‌తో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? తెలుగు క్రేజీ హీరో.. టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటారు..

|

Dec 11, 2024 | 4:32 PM

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఏకంగా టాలీవుడ్ హృతిక్ రోషన్ గా అమ్మాయిల మనసులు దోచుకుంటున్నాడు.

Tollywood: సచిన్‌తో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? తెలుగు క్రేజీ హీరో.. టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటారు..
Sachin Tendulkar
Follow us on

పై ఫొటోలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ తో కలిసి క్యూట్ గా కనిపిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కుమారుడు. తండ్రి బాటలోనే నడిచిన ఆ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లోక్రేజీ హీరోగా మారిపోయాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తన ఎనర్జిటిక్ డ్యాన్స్ లతో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టులో నటిస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. అన్నట్లు ఈ టాలీవుడ్ హీరో అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారంటే. అందుకే ఈ కుర్రహీరోకు ఏకంగా టాలీవుడ్ హృతిక్ రోషన్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. మరి సచిన్ తో ఉన్న ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు నటుడు శ్రీకాంత్ తనయుడు హీరో రోషన్. ఇది అతని చిన్ననాటి ఫొటో. శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోషన్ ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. రోష‌న్ నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు రోషన్. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతకు ముందు అనుష్క నటించిన రుద్రమ దేవి సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రోషన్.

నిర్మలా కాన్వెంట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు రోషన్. ఆ తర్వాత దర్శక కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వచ్చిన పెళ్లిసంద‌డి సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. ఈ సినిమాతోనే శ్రీలీల హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అయ్యింది. ప్రస్తుతం రోష‌న్ వృష‌భ అనే టైటిల్‌తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మలయాళం- తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తుండడం విశేషం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో పాటు రోషన్ కల్కి నిర్మాతలతో కలిసి వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్లో మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పాడు.

ఇవి కూడా చదవండి

రోషన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

వీటితో పాటు ఛాంపియన్ అనే మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రోషన్. త్వరలోనే  ఈ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.