Actress: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ప్రభాస్‌తో నటించిన హాట్ బ్యూటీ.. తరచూ వివాదాల్లో వినిపించే పేరు

|

Aug 11, 2024 | 5:32 PM

స్టార్ హీరోలు, హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వీటిని చూసేందుకు అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే పుట్టిన రోజు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లోనూ నటీనటులు తమ చిన్నప్పటి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు.

Actress: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ప్రభాస్‌తో నటించిన హాట్ బ్యూటీ.. తరచూ వివాదాల్లో వినిపించే పేరు
Actress Childhood Photo
Follow us on

స్టార్ హీరోలు, హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వీటిని చూసేందుకు అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే పుట్టిన రోజు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లోనూ నటీనటులు తమ చిన్నప్పటి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంటాయి. ఆదివారం (ఆగస్టు 11) ఒక స్టార్ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ బ్యూటీ శ్రీలంకలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత ఇండియా వచ్చి బాలీవుడ్ లో స్థిరపడింది. అయితే సినిమాల కంటే వివాదాల్లోనే ఈ అందాల తార పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ మన తెలుగు వారికి కూడా పరిచయమే. ప్రభాస్ నటించిన సాహో సినిమాలో బ్యాడ్ బాయ్ అంటూ హుషారుగా స్టెప్పులేసింది. ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్. ఆదివారం (ఆగస్టు 11) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పై ఫొటో అందులోదే.

తరచూ వివాదాల్లో ఉండే జాక్వెలిన్ కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 కోట్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. జాక్వెలిన్ బహ్రెయిన్‌లో జన్మించింది. అయితే పుట్టి పెరిగింది మాత్రం శ్రీలంకలోనే. ఆమె పౌరసత్వం కూడా లంకలోనే ఉంది. 2009లో విడుదలైన ‘అల్లాదీన్‌’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది జాక్వెలిన్. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో కలిసి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. రూ.200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్‌ చంద్రశేఖర్‌ కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలు సార్లు ఈడీ విచారణకు హాజరైందీ అందాల తార. జాక్వెలిన్ వయసు 39 సంవత్సరాలు. అయితే పెళ్లి గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదీ శ్రీలంక బ్యూటీ.

ఇవి కూడా చదవండి

జాక్వెలిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.