AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. త్వరలోనే హీరోయిన్‌తో లవ్ మ్యారేజ్ కూడా

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ నటుడు ఆ తర్వాత హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడడానికి పక్కింటి అబ్బాయిల కనిపించే ఈ హీరోది ఆంధ్రనే కావడం మరో విశేషం. అయితే ఈ మధ్యన వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. త్వరలోనే హీరోయిన్‌తో లవ్ మ్యారేజ్ కూడా
Tollywood Actor Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 16, 2024 | 7:16 AM

Share

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ నటుడు ఆ తర్వాత హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడడానికి పక్కింటి అబ్బాయిల కనిపించే ఈ హీరోది ఆంధ్రనే కావడం మరో విశేషం. అయితే ఈ మధ్యన వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ రావడంతో ఆలోచనలో పడ్డాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ముఖ్యంగా ఈ యంగ్ హీరో మరి కొన్ని రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తో పెళ్లి పీటలెక్కుతున్నాడు. కొన్ని రోజలు క్రితం ఈ హీరో, హీరోయిన్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’.

సోమవారం (జులై 15) కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. అదే సమయంలో అతని చిన్ననాటి ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. పై ఫొటో కూడా అదే. ఇక ఈ ఫోటోను చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ ఈ హీరోను గుర్తుపట్టాడానికి కాస్త కష్టంగానే అనిపించింది. కానీ కిరణ్ అబ్బవరం చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. త్వరలో ‘క’ అనే పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. సోమవారం ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం లుక్ చాలా కొత్తగా ఉంది. అలాగే టీజర్ కూడా యాక్షన్ సీన్స్, సస్పెన్స్ తో చాలా ఇంట్రెస్ట్ గా ఉంది.

కాగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ‘క’ సినిమాకు సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులు పనిచస్తున్నారు. ఈ మూవీని ఏకంగా రూ. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం ‘ క’ మూవీ టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us