సినిమా కోసం ప్రాణం పెట్టి నటించే నటులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. సినిమాలో పాత్ర కోసం ఎంత కష్టమైనా పడతారు.. ఇటీవలే ఆడుజీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ఏకంగా 16 ఏళ్ళు కష్టపడ్డాడు. అలాగే విక్రమ్ కూడా ఐ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అలాగే చాలా మంది హీరోలు సినిమాల కోసం తమ లుక్స్ మార్చుకున్నారు ఇప్పుడు పైన కనిపిస్తున్న హీరోని గుర్తుపట్టారా.? సినిమా కోసం ఎంతగా మారిపోయాడు మీరే చూడండి.. ఒకప్పుడు క్యూట్ గా లవర్ బాయ్ లా ఉండే ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ఓ సినిమా కోసం ఈ లుక్ లోకి మారిపోయాడు. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో కనిపెట్టరా.?
గతంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, రణదీప్ హుడా వంటి నటులు కూడా తమ లుక్స్ ను మార్చుకున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆయన కొత్త సినిమా ‘చందు ఛాంపియన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదలైంది. కార్తీక్ ఆర్యన్ ఇంతకుముందు సినిమాల్లో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. లవర్ బాయ్‌గా మెరిశాడు. తన క్యూట్ లుక్స్ తో అమ్మాయిల హృదయాలను దోచుకున్నాడు. అయితే ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారిపోయాడు. ‘చందు ఛాంపియన్’ సినిమా కోసం పూర్తిగా కొత్త అవతార్‌లో చేంజ్ అయ్యాడు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ కుర్ర హీరో.
యదార్థ సంఘటన ఆధారంగా ‘చందు ఛాంపియన్’ సినిమా తెరకెక్కుతోంది. పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు మురళీకాంత్ పెట్కర్ పాత్రను కార్తీక్ ఆర్యన్ పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ‘చందు ఛాంపియన్’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జూన్ 14న ‘చందు ఛాంపియన్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పాటలకు ప్రీతమ్ సంగీతం అందించారు. సాజిద్ నడియాద్వాలా, కబీర్ ఖాన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఛాంపియన్ వస్తున్నాడు. నా కెరీర్‌లో ఛాలెంజింగ్, స్పెషల్ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని షేర్ చేయడం గర్వంగా భావిస్తున్నా’ అని కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అభిమానులు ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Champion Aa Raha Hai…
Super excited and proud to share the first poster of the most challenging and special film of my career#ChanduChampion 💪🏻 🇮🇳 #14thJune#KabirKhan #SajidNadiadwala @ipritamofficial @NGEMovies #KabirKhanFilms @WardaNadiadwala @TSeries @PenMovies pic.twitter.com/YcWYMLVXOO— Kartik Aaryan (@TheAaryanKartik) May 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.