ఒకే డ్రస్స్‌లో ఉన్న ఈ హీరో, హీరోయిన్ను గుర్తుపట్టారా.? ఆ ఇద్దరూ పెద్ద స్టార్స్..

|

Sep 06, 2024 | 5:00 PM

కొంతమంది సినిమా కోసం బరువు పెరుగుతారు.. మరికొంతమంది బరువు తగ్గిపోతుంటారు. అలాగే చాలా మంది హీరోలు లేడీ గెటప్స్ లోనూ నటించి మెప్పించారు. అలాగే హీరోయిన్స్ కూడా సినిమాల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు గ్లామరస్ గా కనిపిస్తారు.

ఒకే డ్రస్స్‌లో ఉన్న ఈ హీరో, హీరోయిన్ను గుర్తుపట్టారా.? ఆ ఇద్దరూ పెద్ద స్టార్స్..
Movie News
Follow us on

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది.. పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు.. సినిమా కథకు అనుగుణంగా తమ లుక్ ను మార్చుకుంటుంటారు. కొంతమంది సినిమా కోసం బరువు పెరుగుతారు.. మరికొంతమంది బరువు తగ్గిపోతుంటారు. అలాగే చాలా మంది హీరోలు లేడీ గెటప్స్ లోనూ నటించి మెప్పించారు. అలాగే హీరోయిన్స్ కూడా సినిమాల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు గ్లామరస్ గా కనిపిస్తారు. కొన్నిసార్లు డీ గ్లామర్ గా కనిపిస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా యాక్షన్స్ సీన్స్ కూడా చేస్తుంటారు. ఇక పైన కనిపిస్తున్న హీరో హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకే డ్రస్ లో కనిపిస్తున్న ఆ ఇద్దరూ పెద్ద స్టార్ హీరో, హీరోయిన్. ఆ ఇద్దరూ ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో ఉన్న స్టార్స్‌ను గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న వారిలో ముందుగా హీరో గురించి చూద్దాం. ఆ హీరో ఎవరో కాదు. తమిళ్ స్టార్ హీరో సూర్య. ఈ వర్సటైల్ హీరో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించారు. అలాగే కొన్ని సినిమాల్లో లేడీ గెటప్ లోనూ కనిపించాడు సూర్య. పై ఫోటో అయాన్ అనే సినిమాలోది. తెలుగులో ఇదే సినిమా వీడొక్కడే టైటిల్‌తో రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో సూర్య ఇలా ఓ సీన్ లో లేడీ గెటప్ లో కనిపించాడు.

అలాగే పక్క ఫొటోలో ఉన్న హీరోయిన్ శ్రియ శరన్. ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో చేసింది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోలందరి సరసన నటించింది ఈ అమ్మడు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమాలో చేసింది శ్రియ. ఈ సినిమాలో ఓ సాంగ్ లో ఇలా డిఫరెంట్ లుక్ లో మెరిసింది. ఇక సూర్య, శ్రియ ఇద్దరూ ఓకే డ్రస్ లో కనిపించారు. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఈ ఫోటోల పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సూర్య ప్రస్తుతం కంగువ సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రియ అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

శ్రియ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

హీరో సూర్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.