Tollywood: ఈ కుర్రాడి గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉందబ్బా! పాటలు వింటే దరువేయాల్సిందే.. ఎవరో గుర్తు పట్టారా?

|

Oct 16, 2024 | 8:18 AM

పై ఫొటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు స్వరాలు సమకూరుస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతున్నాడు. టాలీవుడ్, బాలీవుడ్ ,కోలీవుడ్.. ఇలా ఏ భాషా సినిమాలకైనా ఇప్పుడు ఈ అబ్బాయే ఫస్ట్ ఛాయిస్. అందుకే తన డిమాండ్ ను బట్టి ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 10-12 కోట్లు తీసుకుంటున్నాడీ లేటెస్ట్ సెన్సేషన్.

Tollywood: ఈ కుర్రాడి గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉందబ్బా! పాటలు వింటే దరువేయాల్సిందే.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Singer
Follow us on

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే చాలా ఫేమస్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ కుర్రాడికి క్రేజ్ ఉంది. ఇతను సినిమాలో భాగమైతే చాలు.. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అవుద్ది.. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుద్ది. ఇతని బాణీలు, పాటలకు అంత క్రేజ్ ఉంది. అందుకే స్టార్ హీరోలు, పేరున్న దర్శక నిర్మాతలు సైతం తమ సినిమాలకు ఈ అబ్బాయినే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే బాగా డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఈ కుర్రాడిది మొదటి స్థానం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే రెమ్యునరేషన్ అత్యధికంగా తీసుకునే సింగర్లలో కూడా ఈ అబ్బాయిదే అగ్రస్థానం. అంతలా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడీ స్టార్ సింగర్. మరి ఈ ఫొటోలో ఉన్న పిల్లాడెవరో చాలా మందికి ఈపాటికి అర్థమై ఉంటుంది. యస్ ఈ కుర్రాడు మరెవరో కాదు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. బుధవారం (అక్టోబర్ 16) ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ స్టార్ సింగర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇదే క్రమంలో అనిరుధ్ చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ధనుష్ ఆలపించిన ‘వై దిస్ కొలవేరి సాంగ్’ తో బాగా ఫేమస్ అయ్యాడు అనిరుధ్. అప్పటి నుంచి ఇతని జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు అనిరుధ్ నే ఫస్ట్ ఛాయిస్. ఇక తెలుగులోనూ ఈ అబ్బాయి రేంజ్ రోజు రోజుకుకీ పెరుగుతోంది. పవన్ కల్యాన్ అజ్ఞాత వాసి సినిమాకు మొదట బాణీలు అందించాడు అనిరుధ్. ఆ తర్వాత నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు సంగీతం అందించాడు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు ఈ కుర్రాడే స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా విజయంలో సాంగ్స్ ఎంత కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

దేవర సినిమా ప్రమోషన్లలో అనిరుధ్ రవిచందర్..

రజనీకాంత్ తో అనిరుధ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.