పై ఫొటోలో చీరతో ముఖం కప్పుకొని చారడేసి కళ్లతోనే కనికట్టు చేస్తున్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. టాలీవుడ్ లో చేసింది తక్కువ చిత్రాలైన అచ్చమైన తెలుగమ్మాయిలా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజైన ఆమె సినిమా ఒకటి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఇందులో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టగలరా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఈ అందాల తార మరెవరో కాదు హనుమాన్ మూవీ హీరోయిన్ అమృతా అయ్యర్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన అందమైన ఫొటోలను అందులో షేర్ చేసింది. అయితే ముఖం కనిపించకుండా చీరతో కప్పేసుకుంది. కానీ ఆ చారడేసి కళ్లు మాత్రం జిగేల్ మన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట బాగా వైరలవుతోంది. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
చెన్నైలో పుట్టిన అమృతా అయ్యర్ బెంగళూరులో పెరిగింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ లొ మెరిసింది. తర్వాత షార్ట్‌ఫిల్మ్స్‌లో తళుక్కుమంది. 2018 లో ‘పడైవీరన్’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. విజయ్ దళపతి సినిమా ‘విజిల్’లో క్రీడాకారిణిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని సినిమా ‘రెడ్’ తో తెలుగు ఆడియెన్స్ ను పలకిరించింది. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాలో ‘అమ్మాయిగారు’గా అద్భుతంగా నటించింది. ఇక శ్రీ విష్ణు ‘అర్జున ఫల్గుణ’లో శ్రావణిగా సందడి చేసింది. ఆ తర్వాత తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమాలో మీనాక్షిగా పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యింది. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో అల్లరి నరేశ్ సరసన బచ్చల మల్లి అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇది తప్పితే కొత్త సినిమాలేవీ చేయడం లేదు. అయితే కొన్ని తమిళ్ , మలయాళ సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం.
A folk melody that will resonate in every corner of your heart ❣️#BachhalaMalli First Single #MaaOoriJatharalo out now 🎧
▶️ https://t.co/2XQFiaNLCqA @Composer_Vishal Musical 🥁
Lyrics by @ShreeLyricist@allarinares @subbucinema @RajeshDanda_ @_BalajiGutta @brahmakadali pic.twitter.com/ZSdUXzCMue
— Amritha (@Actor_Amritha) July 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.