
బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. వెండితెరపై పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి మెప్పించింది. సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టి.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అదరగొట్టింది. అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైన ఫోటోలో తన తమ్ముడిని ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?. తెలుగులోనే తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాలకు దూరంగా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, న్యాచురల్ స్టార్ నాని సినిమాల్లోనూ నటించింది. తనే హీరోయిన్ నివేదా థామస్.
న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ ఇంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఫస్ట్ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నిన్నుకోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా శాకిని డాకిని లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కనిపించింది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది.
మలయాళం తెరకెక్కిన వెరుథె ఒరు భార్య సినిమాలో అద్భుత నటన కనబరిచినందుకుగానూ.. కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది నివేదా. గతేడాది ఎంతడ సాజి సినిమాలో కనిపించిన నివేదా .. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన తమ్ముడితో కలిసి ఇన్ స్టా రీల్స్ చేస్తూ.. ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.