Tollywood: ఫస్ట్ మూవీతోనే సెన్సెషన్ సృష్టించిన సొగసరి.. ఆ స్టార్ హీరో సతీమణి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..

|

Oct 23, 2024 | 8:15 AM

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగు సినీ రంగంలో ఆమె చాలా ప్రత్యేకం. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: ఫస్ట్ మూవీతోనే సెన్సెషన్ సృష్టించిన సొగసరి.. ఆ స్టార్ హీరో సతీమణి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..
Actress
Follow us on

తెలుగు సినీరంగంలో అందం, అభినయంతో తమకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుని ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్న వారికి గురించి చెప్పక్కర్లేదు. కానీ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకున్నప్పటికీ సరైన బ్రేక్ రాని హీరోయిన్స్.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు పెళ్లి చేసుకుని ఓ గొప్పింటి కోడలిగా మారింది. సినీరంగంలో స్టార్ హీరోగా ఓ వెలుగుతున్న హీరోతో రెండు చిత్రాల్లో నటించిన ఆ అమ్మాయి.. అదే హీరోను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.

తాజాగా ఈ హీరోయిన్ స్కూల్ డేస్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. . 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన ఈ హీరోయిన్.. తండ్రి లాయర్‌ కావడంతో వృత్తి జీవితం కోసం కుటుంబమంతా ఉత్తరాఖండ్‌కు షిఫ్ట్ అయ్యింది. దీంతో లావణ్య చిన్నతనం మొత్తం అక్కడే గడిచిపోయింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ గా ఎంపికైంది.. ఆ తర్వాత వెంటనే 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో మిథున అనే అమ్మాయి పాత్రలో అమాయకపు, అల్లరి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది.

అందాల రాక్షసి తర్వాత లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి చాలా ఫేమస్ అయ్యింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో లావణ్యకు సరైన బ్రేక్ రాలేదు. కొన్నాళ్లుగా లావణ్య నుంచి సరైన మూవీ రాలేదు. గతేడాది నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకుంది లావణ్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.