Actress: దేశాన్ని చుట్టేస్తోన్న హీరోయిన్.. మాస్క్ చాటున ఉన్న ఈ పాన్ ఇండియా బ్యూటీని గుర్తుపట్టారా ?..
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలు రెండు ఉన్నాయి. అంతేకాకుండా అటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?..
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలు రెండు ఉన్నాయి. అంతేకాకుండా అటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. తనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం యానిమల్ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై హైప్ క్రియేట్ చేసింది. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదలవుతుండడంతో దేశంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో యానిమల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. నార్త్ టూ సౌత్ యానిమల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్‍లో ట్రావెల్ చేస్తున్న ఫోటో షేర్ చేస్తూ.. హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, చెన్నై, ఢిల్లీ .. జోంబీ మోడ్ అంటూ పెయిన్ ఎమోజీ షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.
View this post on Instagram
తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇందులో రణబీర్, రష్మికతోపాటు.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. అలాగే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ జోడిగా పుష్ప చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.