Tollywood: బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో బ్లాస్ట్ చేస్తోన్న బ్యూటీ.. క్రేజీ స్టిల్ అదిరిపోయింది.. ఎవరో గుర్తుపట్టండి..

కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్, లేటేస్ట్ క్రేజీ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు మీకోసం యంగ్ హీరోయిన్ క్రేజీ పిక్ తీసుకువచ్చాం. పైన ఓఫోటోను గమనించారా ?.. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యింది. ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. గుర్తుపట్టారా ?.. తనే కేరళ కుట్టి

Tollywood: బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో బ్లాస్ట్ చేస్తోన్న బ్యూటీ.. క్రేజీ స్టిల్ అదిరిపోయింది.. ఎవరో గుర్తుపట్టండి..
Actress

Updated on: Sep 06, 2023 | 2:51 PM

చాలా కాలంగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్, లేటేస్ట్ క్రేజీ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు మీకోసం యంగ్ హీరోయిన్ క్రేజీ పిక్ తీసుకువచ్చాం. పైన ఓఫోటోను గమనించారా ?.. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యింది. ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. గుర్తుపట్టారా ?.. తనే కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. ఈరోజు (సెప్టెంబర్ 6 )పుట్టిన రోజు. ఎర్నాకులంలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఈ బ్యూటీ. కాలేజీ రోజుల్లోనే తన స్నేహితులతో కలిసి ఓ కేఫ్ కు వెళ్లిన ఐశ్వర్య.. అక్కడ సినిమా ఛాన్స్ అనే పోస్టర్ చూసి ఆ మెయిల్ ఐడికి తన ఫోటోస్ పంపించింది. అలా ఈ ముద్దుగుమ్మకు నివిన్ పౌలీతో నటించే ఛాన్స్ వచ్చింది.

ఐశ్వర్యను డాక్టర్ చేయాలని ఆమె తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ ఆమెకు నటనపై ఆసక్తి ఏర్పడింది. అయితే మొదట్లో ఐశ్వర్య నిర్ణయానికి నో చెప్పారు. కానీ ఆ తర్వాత ఐశ్వర్యను సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య మాయానది సినిమాతో తమిళంలో కథానాయికగా అడుగుపెట్టింది. ఆ తర్వాత జగమే తంత్రం, విదియత, కర్కి, కెప్టెన్, పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో నటించింది. గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తర్వాత అమ్ముడు, మట్టి కుస్తీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత సినిమాలో నటించింది.

ఐశ్వర్యకు సీనియర్ హీరోయిన్ శోభన అంటే ఇష్టం. అలాగే తెలుపు రంగు చాలా ఇష్టం. అలాగే ఫహద్ ఫాసిల్, కామెడియన్ కాళీ వెంకట్ ఫేవరెట్ నటులు. ఐశ్వర్యకు దుస్తులు చీర. ముఖ్యంగా కేరళ చీర. పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఐశ్వర్య నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక విష్ణు విశాల్ జోడిగా నటించిన మట్టి కుస్తీ చిత్రాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది ఐశ్వర్య. విభిన్నమైన కథలు వస్తే చేయాలని ఉందని మనసులోని మాటలు బయటపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.