Viral Photo: హంస నడక.. కారుమబ్బులాంటి కురులు.. కుర్రకారు మతిపోగొడుతున్న ఈ భామ ఎవరో గుర్తుపట్టారా?
జాబిల్లి మోము.. చారడేసి కళ్లతో అబ్బాయిల మనసు దొచుకున్న ఈ చిన్నది.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
పైన ఫోటోలో ఉన్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ?. హంస నడక.. కారుమబ్బులాంటి కురులతో కుర్రకారు మతిపోగొడుతున్న ఈ చిన్నది.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. జాబిల్లి మోము.. చారడేసి కళ్లతో అబ్బాయిల మనసు దొచుకున్న ఈ చిన్నది.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే సినీప్రియులను మెప్పించింది. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ప్రస్తుతం ఈ అమ్మడు.. కేరళలో అతి ముఖ్యగమైన ఓనమ్ పండుగను సెలబ్రెట్ చేసుకుంటుంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ సైతం కేరళ సోయగమే. ఎవరో గుర్తుపట్టండి.
ఈ అందాల ముద్దుగుమ్మ మరెవరో కాదు.. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమా తెలుగు తెరకు పరిచమయైన ఈ చిన్నది.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల కార్తీకేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో హిందీలో వసూళ్ల సునామి సృష్టిస్తోంది. కేరళలలో అతి ముఖ్యమైన పండుగలలో ఓనమ్ ఒకటి. తాజాగా హీరోయిన్ అనుపమ ఇంట్లో ఓనమ్ ఫెస్టివల్ సెలబ్రెషన్స్ జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అనుపమ. తెల్లచీర, మల్లెపూలు పెట్టుకుని సంప్రదాయబద్దంగా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దమందారం. అనుపమ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.