AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీ దుంపతెగ.. అది సింహం రా సామీ.. వీళ్లు ఏం చేశారో మీరే చూడండి..

సింహం అంటేనే అందరికీ హడల్.. కానీ ఆ సింహాన్నే ముగ్గురు వ్యక్తులు బైకులపై వెంబడిస్తే ఎలా ఉంటుంది..? గుజరాత్‌లోని అంబర్డి సఫారీ పార్క్‌లో జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది వీఐపీల మెప్పు కోసమా లేక నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది చేసిన అత్యుత్సాహమా? అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Viral Video: మీ దుంపతెగ.. అది సింహం రా సామీ.. వీళ్లు ఏం చేశారో మీరే చూడండి..
Forest Guards Chasing Lion
Krishna S
|

Updated on: Nov 16, 2026 | 2:55 PM

Share

అడవికి రాజైన సింహాన్ని కొందరు వ్యక్తులు బైక్‌పై వెంబడిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా ధారి గిర్ ఈస్ట్ డివిజన్ పరిధిలోని అంబర్డి సఫారీ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జంతువుల పట్ల అటవీ శాఖ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు వ్యక్తులు వేర్వేరు బైకులపై ఒక సింహాన్ని చుట్టుముట్టి, బలవంతంగా తరిమే ప్రయత్నం చేశారు. వీరిలో ఒకరి చేతిలో వాకీటాకీ ఉండటం, అలాగే సమీపంలోనే అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ బొలెరో వాహనం వెళ్తుండటం ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయంపై అనుమానాలకు తావిచ్చింది. వీకెండ్‌లో సఫారీ పార్కుకు వచ్చిన కొందరు వీఐపీ సందర్శకులకు సింహాన్ని దగ్గరగా చూపించేందుకే సిబ్బంది ఇలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని వైపుల నుంచి బైకులతో వెంబడించడంతో ఒక్కసారిగా అసహనానికి గురైన ఆ సింహం, తిరిగి బైకుపై ఉన్న వ్యక్తుల వైపు దూసుకెళ్లడం కూడా వీడియోలో రికార్డయింది.

ముగ్గురు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తొలగింపు

ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో గుజరాత్ అటవీ శాఖ వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ జైపాల్ సింగ్ స్పందిస్తూ.. ‘‘సాయంత్రం వేళల్లో సింహాలను వాటి నివాస ప్రాంతమైన క్రాల్ వైపునకు మళ్లించడం సాధారణ ప్రక్రియ. సాధారణంగా ఈ పనిని జీపులో వెళ్లి చేస్తారు. కానీ కొందరు సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా బైకులను ఉపయోగించారు. వీడియోలో కనిపించిన ముగ్గురు వ్యక్తులు థర్డ్ పార్టీ ద్వారా నియమితులైన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది. వారికి నోటీసులు జారీ చేసి, తక్షణమే విధుల నుంచి తొలగించాం’’ అని స్పష్టం చేశారు.

అధికారుల వివరణ ఇదే..

మరోవైపు, ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ మితేష్ వానియా సిబ్బంది చర్యను సమర్థించే ప్రయత్నం చేశారు. దీపావళి సమయంలో ఈ వీడియో తీశారని పేర్కొన్న ఆయన.. ‘‘పార్కులోని సింహాలకు క్రాల్ అనే ప్రత్యేక కంచె ప్రాంతంలో ఆహారం పెడతాం. ఆ సింహం క్రాల్ నుంచి దూరంగా వెళ్లడంతో దానిని తిరిగి సురక్షిత ప్రాంతానికి రప్పించేందుకే సిబ్బంది బైకులపై ప్రయత్నించారు. అంతేతప్ప ఆ మూగజీవాన్ని వేధించాలనే ఉద్దేశం అస్సలు లేదు’’ అని వివరణ ఇచ్చారు.

వీడియో చూడండి..

Follow Us