Tollywood: వేణుమాధవ్, ఉదయభాను మధ్యలో ఉన్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. ? టాలీవుడ్ క్రేజీ కమెడియన్..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఫోటో తెగ వైరలవుతుంది. అదే దివంగత కమెడియన్ వేణు మాధవ్, యాంకర్ ఉదయభానుల పిక్. వీరిద్దరి మధ్యలో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ కమెడియన్. అప్పట్లో ఓ ఛానెల్ లో ప్రసారమైన వన్స్ మోర్ ప్లీజ్ షోకు వేణు మాధవ్, ఉదయభాను యాంకర్లుగా వ్యహరించారు. ఇప్పుడు వీరిద్దరి త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

Tollywood: వేణుమాధవ్, ఉదయభాను మధ్యలో ఉన్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. ? టాలీవుడ్ క్రేజీ కమెడియన్..
Venumadav

Updated on: Apr 11, 2025 | 9:48 AM

టాలెంట్ ఉంటే చాలు ఎన్నాళ్లకైనా సక్సెస్ కావచ్చు అనే మాట ఈ నటుడికి సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. బుల్లితెరపై పలు రియాల్టీ షోల ద్వారా తన సినీప్రయాణం స్టార్ట్ చేశాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ కమెడియన్‏గా మారి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. పైన ఫోటోలో దివంగత కమెడియన్ వేణు మాధవ్, ఉదయభాను మధ్య నిలబడి ఉన్న ఆ కుర్రాడిని గుర్తుపట్టారా.. ? అప్పట్లో ఉదయభాను, వేణు మాధవ్ ఇద్దరూ కలిసి వన్స్ మోర్ ప్లీజ్ షోకు యాంకర్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ షోకు వచ్చిన మిమిక్రీ ఆర్టిస్టు వీరిద్దరితో కలిసి ఫోటో దిగాడు. కానీ ఇప్పుడు అతడు తెలుగులో స్టార్ కమెడియన్. అద్భుతమైన కామెడీ టైమింగ్, పంచులతో వెండితెరపై కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? అతడేనండి.. జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి. తీసుకోలేదా రెండు లక్షల కట్నం, ఆగుతావా ఓ రెండు నిమిషాలు అంటూ చెప్పే డైలాగ్స్ తో మరింత పాపులర్ అయ్యాడు.

రచ్చ రవి.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ మరింత పాపులర్ అవుతున్నాడు. బలగం, భగవంత్ కేసరి, భీమా, ఓం భీమ్ బుష్, పురుషోత్తముడు, భలే ఉన్నాడే, లగ్గం, ఉత్సవం వంటి చిత్రాల్లో నటించాడు. ఇప్పటివరకు అరజనుకు పైగా చిత్రాల్లో నటించాడు. అంతకు ముందు బుల్లితెరపై జబర్దస్త్ కమెడీ షో ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చమ్మక చంద్ర టీంలో తన కామెడీతో నవ్వించాడు.

కెరీర్ ప్రారంభంలో వన్స్ మోర్ ప్లీజ్ షోకు హాజరయ్యాడు రచ్చ రవి. అందులో మిమిక్రీ ఆర్టిస్టుగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రంలో వేణు మాధవ్, ఉదయభాను యాంకర్లుగా చేస్తున్నప్పుడు రచ్చ రవి మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేశాడు.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?