ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. హీరోహీరోయిన్ల బాల్యం జ్ఞాపకాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్.. రామ్ చరణ్, ప్రభాస్, నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ హల్చల్ చేయగా..ఇప్పుడు మరో చిన్నోడి పిక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. నిజమే.. మరీ ఈ బుడతడు పాన్ ఇండియా క్రేజీ స్టార్. నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు ప్రేక్షకుల మనసులు దొచుకున్నాడు. కేవలం లవర్ బాయ్‌గానే కాదు.. మాస్ యాక్షన్ చిత్రాలతోనూ మెప్పించాడు. గుర్తుపట్టరా ?. పైన ఫోటోలో తన తాతయ్యతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
తాతయ్యతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఆ బుడతడు మన మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన చరణ్.. మొదటి సినిమాతో నటుడిగా మార్కులు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత రెండో చిత్రం మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ మూవీ కంటే సెకండ్ మూవీలో చెర్రీ నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన చరణ్.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచదృష్టిని ఆకర్షించాడు చరణ్. ఇందులో కొమురం భీమ్ పాత్రలో తారక్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ కనిపించి మెప్పించారు. ఈ సినిమాకు దేశమే కాదు.. ప్రపంచమే ఫిదా అయ్యింది. రూ. 400 కోట్లతో నిర్మించి దాదాపు రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్నారు చరణ్. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా టాక్. అంతేకాదు.. త్వరలోనే తండ్రి కాబోతున్నారు కూడా.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.